ఈసారికి సన్ రైజర్స్ కథ ముగిసింది!

  • ఐపీఎల్-16 నుంచి సన్ రైజర్స్ నిష్క్రమణ
  • ఇవాళ్టి ఓటమితో ప్లే ఆఫ్ అవకాశాలకు పూర్తిగా తెర
  • 189 పరుగుల లక్ష్యఛేదనలో 154 పరుగులే చేసిన సన్ రైజర్స్
  • ప్లే ఆఫ్ దశకు చేరిన గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్ తాజా సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ అవకాశాలకు పూర్తిగా తెరపడింది. గుజరాత్ టైటాన్స్ తో పోరులో సన్ రైజర్స్ 34 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 189 పరుగుల లక్ష్యఛేదనలో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 154 పరుగులు మాత్రమే చేసింది. 

వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ హెన్రిచ్ క్లాసెన్ 64 పరుగులతో ఒంటరిపోరాటం చేశాడు. ఇతర బ్యాట్స్ మెన్ నుంచి క్లాసెన్ కు పెద్దగా సహకారం అందలేదు. చివర్లో భువనేశ్వర్ కుమార్ 27, మయాంక్ మార్కండే 18 (నాటౌట్) పరుగులు చేశారు. ఓ దశలో సన్ రైజర్స్ 59 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. కానీ క్లాసెన్ దూకుడుగా ఆడడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో షమీ 4, మోహిత్ శర్మ 4, యశ్ దయాళ్ 1 వికెట్ తీశారు. 

ఇవాళ్టి మ్యాచ్ లో గెలిచుంటే, సన్ రైజర్స్ కు కొన్ని అవకాశాలు ఉండేవి. ఈ ఓటమితో అవన్నీ ఆవిరయ్యాయి. సన్ రైజర్స్ ఈ టోర్నీలో ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్ ల్లో గెలవడం వల్ల సన్ రైజర్స్ కు ఎలాంటి ఉపయోగం లేనప్పటికీ, ఇతర జట్ల అవకాశాలను మాత్రం ప్రభావితం చేసే అవకాశం ఉంది. 

అటు, తాజా విజయంతో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్ బెర్తు దాదాపుగా ఖరారైంది.


More Telugu News