రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటుకు సంబంధించి కిషన్ రెడ్డి ఏమన్నారంటే..!
- రాజాసింగ్ పై త్వరలో పార్టీ సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తుందని వ్యాఖ్య
- సస్పెన్షన్ ఉపసంహరణపై చర్చిస్తున్నట్లు వెల్లడి
- పార్టీదే తుది నిర్ణయమని వ్యాఖ్యానించిన కిషన్ రెడ్డి
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై తమ పార్టీ త్వరలోనే సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తుందని బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయనపై సస్పెన్షన్ వేటును ఉపసంహరించుకునే ప్రక్రియపై చర్చిస్తున్నట్లు తెలిపారు. అంతిమంగా పార్టీదే తుది నిర్ణయమన్నారు.
రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటును ఉపసంహరించే సమావేశంలో తాను కూడా పాల్గొంటానని, దీనిపై అన్నీ ఆలోచించి అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రవక్తపై వ్యాఖ్యల నేపథ్యంలో గత ఏడాది ఆగస్ట్ నెలలో బీజేపీ ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆయన అరెస్ట్ అయి, బెయిల్ పై విడుదలయ్యారు.