చికోటి ప్రవీణ్ ను ఏడు గంటలపాటు విచారించిన ఈడీ అధికారులు
- హైదరాబాద్‌లోని ఈడి కార్యాలయంలో సుదీర్ఘ విచారణ
- ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, నగదు బదిలీలపై ప్రశ్నలు
- థాయ్ లాండ్ క్యాసినో కేసులో అరెస్టై, విడుదలైన చికోటి
చికోటి ప్రవీణ్ ను ఈడీ ఏడు గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో విచారించారు. పైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, నగదు బదిలీలపై అధికారులు ప్రశ్నించారని తెలుస్తోంది. థాయ్ లాండ్ క్యాసినో కేసు అనంతరం ఈడీ పలువురికి నోటీసులు ఇచ్చింది. ఇటీవల థాయ్ లాండ్ లో చికోటి అరెస్టయ్యాడు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు.
సంఘటన స్థలం నుండి అక్కడి పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు ట్రాన్సాక్షన్స్ గురించి ఈడీ ప్రశ్నించింది. ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని, తాను ఆహ్వానితుడిగా వెళ్లానని చికోటి ఇదివరకే పలుమార్లు చెప్పాడు. ఈ కేసుకు సంబంధించి చికోటితో పాటు చిట్టి దేవేందర్, మాధవరెడ్డి, సంపత్ లకు ఈడీ నోటీసులు ఇచ్చింది.