ప్రశాంత్ కిశోర్ కాలికి గాయం... నిలిచిన పాదయాత్ర

  • గతేడాది అక్టోబరు 2 నుంచి ప్రశాంత్ కిశోర్ పాదయాత్ర
  • ఇప్పటివరకు 2,500 కిమీ నడక
  • ఎడమ కాలి కండరాలపై తీవ్ర ఒత్తిడి
  • 20 రోజులు విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యులు
  • జూన్ 11న పాదయాత్ర మళ్లీ ప్రారంభమవుతుందన్న ప్రశాంత్ కిశోర్
ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్ బీహార్ లో జన్ సురాజ్ పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం అక్టోబరు 2న ప్రశాంత్ కిశోర్ పాదయాత్ర ప్రారంభమైంది. ఇప్పటివరకు ఆయన 2,500 కిమీపైగా నడిచారు. సుదీర్ఘ పాదయాత్ర కారణంగా ఆయన కాలి గాయానికి గురయ్యారు. దాంతో పాదయాత్ర నిలిచిపోయింది. 

ఎక్కువ దూరం నడవడం వల్ల ఎడమకాలి కండరాలపై తీవ్ర ఒత్తిడి పడడంతో అది గాయంగా మారిందని వైద్యులు తెలిపారు. దీంతో ఆయన మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. గాయంపై ప్రశాంత్ కిశోర్ స్పందించారు. గాయం వల్ల పాదయాత్రకు విరామం ప్రకటిస్తున్నట్టు తెలిపారు. కాలి గాయం తప్ప, మరే ఇతర ఆరోగ్య సమస్యలు లేవని వెల్లడించారు. జూన్ 11న పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 

బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో విభేదాల నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ పాదయాత్రకు ప్రాధాన్యత ఏర్పడింది. బీజేపీ కోసమే ప్రశాంత్ కిశోర్ పాదయాత్ర చేస్తున్నాడని నితీశ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు.


More Telugu News