టాస్ గెలిచిన సన్ రైజర్స్... తొలి ఓవర్లోనే వికెట్ తీసిన భువీ
- అహ్మదాబాద్ లో సన్ రైజర్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
- ధాటిగా ఆడుతున్న గిల్, సుదర్శన్
ఐపీఎల్ తాజా సీజన్ లో ప్లే ఆఫ్ ఆశలు దాదాపు గల్లంతైన స్థితిలో, ఎక్కడో ఆశలు మిణుకుమిణుకుమంటుండగా... సన్ రైజర్స్ హైదరాబాద్ నేడు గుజరాత్ టైటాన్స్ తో తలపడుతోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. పేసర్ భువనేశ్వర్ కుమార్ తొలి ఓవర్లోనే గుజరాత్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహాను డకౌట్ చేసి శుభారంభం అందించాడు.
అయితే రెండో ఓవర్లో మార్కో జాన్సెన్ వైడ్లు, నోబాల్ వేసి భారీగా పరుగులు సమర్పించుకోగా, ఆ తర్వాత భువీని కూడా శుభ్ మాన్ గిల్, సాయి సుదర్శన్ బౌండరీల మోత మోగించారు. లెఫ్టార్మ్ పేసర్ ఫజల్ హక్ ఫరూఖీకి సైతం ఇదే ట్రీట్ మెంట్ ఎదురైంది. గిల్ కొన్ని కళాత్మకమైన షాట్లతో బంతిని బౌండరీ దాటించాడు.
ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ స్కోరు 4 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 50 పరుగులు. గిల్ 28, సాయి సుదర్శన్ 14 పరుగులతో ఆడుతున్నారు.