భర్తతో మందు మాన్పించడానికి భార్య ఏం చేసిందో చూడండి!
- ఆగ్రాలో చోటుచేసుకున్న ఘటన
- నిత్యం తాగి ఇంటికి వస్తున్న భర్త
- భార్యతో గొడవలు.. తాగుబోతులా నటించి భర్తను చితకబాదడం మొదలుపెట్టిన మహిళ
- కౌన్సిలింగ్ సెంటర్ ను ఆశ్రయించిన భర్త
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. భర్త రోజూ తాగి వచ్చి గొడవ చేస్తుండడంతో అతడితో మద్యం మాన్పించేందుకు భార్య తాగుబోతు అవతారం ఎత్తింది. ఆ వ్యక్తి ప్రతిరోజు మద్యం మత్తులో ఇంటికి వచ్చేవాడు. భర్తతో తాగుడు మాన్పించాలని ఆమె చాలా ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య నిత్యం ఘర్షణ జరుగుతుండేది. దాంతో ఆ మహిళ ఎవరూ చేయని పని చేసింది.
భర్త ఇంటికి వచ్చేసరికి తాగుబోతులా నటించేది. అచ్చం తాగుబోతులు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడేది... మద్యం మత్తులో ఎలా నడుస్తారో అలాగే నడిచేది. దాంతో ఆ భర్త దిగ్భ్రాంతికి గురయ్యాడు. తన భార్య మందుకొట్టడం ఏంటని జుట్టు పీక్కున్నాడు.
అతడిని మరింత నివ్వెరపరిచేలా ఆ మహిళ చేయిచేసుకోవడం ప్రారంభించింది. తాగి వచ్చి తనను ఎలా కొట్టేవాడో, తాను కూడా అతడిని అలాగే చితకబాదేది. ఇలా ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయే తప్ప సమస్య పరిష్కారం కాలేదు. అతడు తాగి రావడం, ఆమె తాగినట్టు నటించడం కొనసాగాయి.
ఈ నేపథ్యంలో, భార్య కూడా తనలాగే మద్యానికి బానిస అయిందని భావించిన ఆ వ్యక్తి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ను ఆశ్రయించాడు. భార్య తాగిన మత్తులో వెంటపడి ఎలా కొడుతుందో చూడండి అంటూ ఓ వీడియోను అక్కడికి వారికి చూపించాడు. దాంతో ఆ కౌన్సిలింగ్ సెంటర్ సిబ్బంది భార్యాభర్తలిద్దరితో మాట్లాడారు.
తాను భర్తతో మద్యం మాన్పించడానికే తాగుబోతులా నటిస్తున్నానని భార్య వెల్లడించింది. అనంతరం ఆ కౌన్సిలింగ్ సెంటర్ వారు ఆ దంపతుల మధ్య ఓ ఒప్పందం కుదిర్చారు. అతడు కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే మద్యం తాగాలని, అందుకు భార్య కూడా ఒప్పుకోవాలని ప్రతిపాదించారు. అంతేకాదు, మద్యం తాగినప్పుడు భార్యతో వాగ్వాదం పెట్టుకోవద్దని అతడికి స్పష్టం చేశారు.