ఎల్లుండి బీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంటరీ అత్యవసర సమావేశం

  • ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం రెడు గంటలకు కేసీఆర్ అధ్యక్షతన సమావేశం
  • ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు
  • పార్టీ విస్తరణ, అవతరణ దినోత్సవం సహా పలు అంశాలపై చర్చ
ఎల్లుండి బీఆర్ఎస్ అత్యవసర సమావేశం కానుంది. హైదరాబాద్ లోని తెలంగాణ భ‌వ‌న్‌లో ఈ నెల 17వ తేదీన బీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం కొన‌సాగ‌నుంది. ఈ స‌మావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజ‌రు కానున్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ, జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు తదితర అంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది.


More Telugu News