హైదరాబాదులో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లకు ఆహ్వానం
- ఇటీవల ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు శ్రీకారం
- విజయవాడలో అంకురార్పణ సభ
- మే 20న హైదరాబాదులో సావనీర్, వెబ్ సైట్ ఆవిష్కరణ
- నందమూరి కుటుంబ సభ్యులను ఆహ్వానించిన కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్
ఇటీవల విజయవాడలో నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, హైదరాబాదులో మే 20వ తేదీన శకపురుషుడు సావనీర్, జయహో ఎన్టీఆర్ వెబ్ సైట్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్ సైట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.
ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నారు. కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ స్వయంగా జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్ ల నివాసాలకు వెళ్లి ఆహ్వాన పత్రికలు అందజేశారు.
అంతేకాదు, దగ్గుబాటి పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి జయకృష్ణ, నందమూరి మోహనకృష్ణ, గారపాటి లోకేశ్వరి, కంఠంనేని ఉమాశ్రీనివాస్ ప్రసాద్, ఎన్టీఆర్ బావమరిది కాట్రగడ్డ రుక్మాంగదరావు తదితరులను కలిసి ఎన్టీఆర్ శతజయంతి వేడుకల కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.
ఎన్టీఆర్ పై ప్రత్యేకంగా రూపొందించిన శకపురుషుడు సావనీర్, వెబ్ సైట్ ఆవిష్కరణ కార్యక్రమం మే 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు హైదరాబాదులోని కేపీహెచ్ బీ కైతలాపూర్ మైదానంలో జరగనుంది.