చంద్రబాబు సూచనను స్వాగతించాలి: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

  • చంద్రబాబు పెద్ద నోట్ల రద్దు ప్రతిపాదన చేశారన్న లక్ష్మీనారాయణ
  • ఆర్థికనేరాలు, ఎన్నికల్లో డబ్బు పంపిణీ అరికట్టడానికి బాబు సూచన చేశారని వెల్లడి
  • రూ.2 వేల నోటు రద్దు చేయాలని తాను ఎప్పటినుంచో చెబుతున్నానని వివరణ
ఆర్థిక నేరాలను తగ్గించడానికి, ఎన్నికల సమయంలో డబ్బు పంపిణీని అరికట్టడానికి రూ.2,000, రూ.500 నోట్లను రద్దు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన సూచనను స్వాగతించాలని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. తాను కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. 

ఎన్నికల సంస్కరణలో భాగంగా రూ.2,000 నోటును రద్దు చేయాలని తాను ఎప్పటినుంచో చెబుతున్నానని, తక్షణమే ఆ పెద్ద నోటు రద్దు చేయాలని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా దీన్ని సిఫారసు చేయాలని కోరారు.


More Telugu News