'శాకుంతలం' తెచ్చిన నష్టం ఇదేనంటూ టాక్!
- ఏప్రిల్ 14న విడుదలైన 'శాకుంతలం'
- 60 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన సినిమా
- స్ట్రీమింగ్ రైట్స్ తోనే సగం రాబట్టిన చిత్రం
- ఇంకా జరగని శాటిలైట్ బిజినెస్
- 14.68 కోట్ల నష్టం వచ్చినట్టుగా టాక్
గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'శాకుంతలం' సినిమా, ఏప్రిల్ 14వ తేదీన విడుదలైంది. సమంత ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, గుణశేఖర్ తో పాటు దిల్ రాజు కూడా నిర్మాతగా ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా, తొలి రోజునే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కారణమేదైనా రిలీజ్ కి ముందు కూడా ఈ సినిమా అంతగా బజ్ లేదు.
ఈ కథ ప్రకృతితోను .. వన్యమృగాలతోను ముడిపడి ఉంటుంది. అందువలన కథలో చాలా భాగం గ్రాఫిక్స్ తోనే నడుస్తుంది. ఇందుకోసం భారీస్థాయిలో ఖర్చు చేశారు. 60 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. కానీ థియేటర్స్ నుంచి అనుకున్న వసూళ్లకు ఈ సినిమా చాలా దూరంలోనే ఆగిపోయింది. బడ్జెట్ లో సగం స్ట్రీమింగ్ రైట్స్ వలన వచ్చాయని అంటున్నారు.
ఇక మిగతా సగంలో శాటిలైట్స్ రైట్స్ పరంగా కొంత రావొచ్చని చెబుతున్నారు. జరిగిన బిజినెస్ ను బట్టి చూసుకుంటే, ఈ సినిమా వలన 14.68 కోట్ల నష్టం వచ్చిందని చెబుతున్నారు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, దేవ్ మోహన్ .. మోహన్ బాబు .. ప్రకాశ్ రాజ్ .. కీలకమైన పాత్రలను పోషించారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 12 నుంచి ఈ సినిమా అందుబాటులో ఉంది.