అధిక రక్తపోటు తగ్గేందుకు ఆహారపరంగా పరిష్కారాలు
- పొటాషియం, మెగ్నీషియంతో మంచి ఫలితాలు
- ఎలక్ట్రోలైట్స్, పీచు ఉండే పదార్థాలు తీసుకోవాలి
- తగినంత నిద్ర, శారీరక శ్రమ అవసరం
- దానిమ్మ, అరటి, పుచ్చకాయతో బీపీ అదుపులోకి
అధిక రక్తపోటు (బీపీ/హైపర్ టెన్షన్) ను సైలెంట్ కిల్లర్ గా చెబుతారు. బీపీ పరిమితికి మించి ఉన్నా పైకి తెలియకపోవచ్చు. కొద్ది మందికి పలు లక్షణాల రూపంలో పైకి సంకేతాలు కనిపిస్తాయి. మధ్య వయసుకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా రక్తపోటును నియంత్రణలో పెట్టుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం అనే ఎలక్ట్రోలైట్స్ రక్తపోటును నియంత్రించడంలో ఎంతో సాయపడతాయి. కనుక తీసుకునే ఆహారంలో వీటికి చోటు ఇవ్వాలి. బీన్స్, పాలు, యుగర్ట్, కాటేజ్ చీజ్, బెర్రీలు, సిట్రస్ జాతి పండ్లు, కొబ్బరి నీరు, ఆకుపచ్చని కూరగాయలు, నట్స్, చియా సీడ్స్, గుమ్మడి గింజలు, బాదం, వాల్ నట్, పప్పు ధాన్యాలు తీసుకోవాలి. వీటిల్లో పొటాషియం, క్యాల్షియం,మెగ్నీషియం ఉంటాయి. వీటిల్లో పీచు కూడా తగినంత లభిస్తుంది. పీచు ఉన్నవి తినడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా రక్షణ ఉంటుంది. దీంతో హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గుతుంది.
పండ్లలో అరటి పండుకు బీపీని తగ్గించే శక్తి ఉంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. స్ట్రాబెర్రీలో యాంథోసియాన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. విటమిన్ సీ, పొటాషియం, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల బీపీ నియంత్రణలో పెట్టుకోవచ్చు. పుచ్చకాయలో విటమిన్ సీ, పొటాషియం, లైకోపీన్ ఉంటాయి. ఇది కూడా బీపీ తగ్గించడానికి మంచి ఎంపిక అవుతుంది. మామిడి పండ్లలో బీటా కెరోటిన్, పొటాషియం ఉంటాయి. ఏసీఈ (యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్) అనే ఎంజైమ్ ను తగ్గించే గుణాలు దానిమ్మ పండ్లకు ఉన్నాయి. ఏసీఈ అనేది రక్త నాళాల సైజును నిర్ణయించడంలో పాత్ర పోషిస్తుంది. దీన్ని తగ్గించడం వల్ల బీపీ రిస్క్ తగ్గుతుంది. ఈ విధంగా సరైన ఆహారంతోపాటు రోజులో తగినంత సమయం నిద్రపోవాలి. శారీరక వ్యాయామం చేయాలి. తగినంత నీరు తీసుకోవాలి.