ఇది నా కెరియర్ లోనే పెద్ద సినిమా: దర్శకురాలు నందినీ రెడ్డి!

  • ఈ నెల 18వ తేదీన 'అన్నీ మంచి శకునములే'
  • సంతోష్ జోడీ కట్టిన మాళవిక నాయర్ 
  • వాళ్ల గురించి ఆడియన్స్ మాట్లాడుకుంటారన్న నందిని రెడ్డి 
  • తన కెరియర్ లో ఇదే పెద్ద సినిమా అని వ్యాఖ్య  

సున్నితమైన ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించడంలో నందినీ రెడ్డికి మంచి పేరు ఉంది. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'అన్నీ మంచి శకునములే' రెడీ అవుతోంది. ఈ నెల 18వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా, కొంతసేపటి క్రితం ప్రీ రిలీజ్ ఈవెంటును జరుపుకుంది. 

ఈ స్టేజ్ పై నందినీ రెడ్డి మాట్లాడుతూ .. "ఇది సినిమా ఫంక్షన్ కాదు .. మా ఇంటి ఫంక్షన్ లా అనిపిస్తోంది నాకు. ఎందుకంటే ఈ బ్యానర్ తో నాకున్న అనుబంధం అలాంటిది. నానితో నా జర్నీ 'అలా మొదలైంది' సినిమాతో మొదలైంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఆయన లేకపోతే ఆ సినిమా అసలు పూర్తయ్యేదే కాదు" అని అన్నారు. 

ఈ బ్యానర్ పై నాగ్ అశ్విన్ .. అనుదీప్ .. హను రాఘవపూడి వరుసగా హిట్స్ ఇస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు నా వంతు వచ్చింది .. దాంతో నాకు టెన్షన్ మొదలైంది. దత్తుగారు మా వెనకే ఉంటారు. ఏది అవసరమైనా ఆయనను అడగొచ్చు. అంతగా సపోర్టు చేస్తూ ఉంటారు. ఇది నా కెరియర్లో నేను చేసిన పెద్ద సినిమా. నేను రాసుకున్న కథకి అంతా కలిసి ప్రాణం పోశారు. హీరో .. హీరోయిన్స్ గురించి ఇప్పుడు నేను మాట్లడను. 18వ తేదీ తరువాత ఆడియన్స్ మాట్లాడతారు" అంటూ చెప్పుకొచ్చారు.


More Telugu News