ఐపీఎల్ లో నేడు మరో ఇంపార్టెంట్ మ్యాచ్... టాస్ గెలిచిన ధోనీ

  • ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్
  • నేటి రెండో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ × కోల్ కతా
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్కే సారథి
ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్ లో భాగంగా రెండో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగు పర్చుకోవాలంటే ఈ మ్యాచ్ లో నెగ్గడం చెన్నైకి అవసరం. చెన్నై పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.

అటు, పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్న కోల్ కతా కూడా ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ప్లే ఆఫ్ రేసులో నిలుస్తుంది. అందుకే, నేటి మ్యాచ్ కు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ మ్యాచ్ కోసం కోల్ కతా జట్టులో ఒక మార్పు జరిగింది. అనుకూల్ రాయ్ స్థానంలో వైభవ్ అరోరాకు తుది జట్టులో స్థానం కల్పించారు. అటు చెన్నై తుది జట్టులో శ్రీలంక పేసర్ మతీష పతిరణకు స్థానం దక్కలేదు.


More Telugu News