అన్నింటికీ థ్యాంక్స్ అమ్మా.. మాతృదినోత్సవం సందర్భంగా నారా లోకేశ్ ట్వీట్
- తన తల్లి నారా భువనేశ్వరితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన లోకేశ్
- భగవంతుడు మనలో ప్రతి ఒక్కరికి ఇచ్చిన గొప్ప వరం అమ్మ అని వ్యాఖ్య
- నంద్యాల జిల్లాలో కొనసాగుతున్న లోకేశ్ యువగళం పాదయాత్ర
మాతృదినోత్సవం సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుడు ప్రతి ఒక్కరికి ఇచ్చిన గొప్ప వరం అమ్మ అని అన్నారు. తన తల్లి నారా భువనేశ్వరితో కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
‘‘ఆమె ప్రేమ షరతులు లేనిది.. ఆమె త్యాగం అసమానమైనది. మన జీవితాల్లో భారాన్ని తగ్గించడానికి ఆమె చేసే కృషి సాటిలేనిది. భగవంతుడు మనలో ప్రతి ఒక్కరికి ఇచ్చిన గొప్ప వరం అమ్మ. అన్నింటికీ ధన్యవాదాలు అమ్మా’’ అని ట్వీట్ చేశారు. హ్యాపీ మదర్స్ డే హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు.
ప్రస్తుతం నంద్యాల జిల్లాలో లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఆదివారం ఉదయం శ్రీశైలం నియోజకవర్గంలో యాత్ర ప్రారంభించిన ఆయన.. వెలగాము వద్ద కొత్త రామాపురం గ్రామస్తులతో సమావేశం అయ్యారు. గ్రామస్తులు లోకేశ్ కు సమస్యలను విన్నవించారు. గత ప్రభుత్వం నిర్మించిన సిద్దాపురం చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి తమ పొలాలకు పిల్లకాల్వలు తీయించాలని కోరారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమస్యలు తీరుస్తామని, సిద్దాపురం లిఫ్ట్‌కు అనుబంధంగా పిల్లకాల్వల పనులు పూర్తిచేస్తామని లోకేశ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.