బీజేపీ మత, బీఆర్ఎస్ కుట్ర రాజకీయాలకు చెంపపెట్టు: షర్మిల
- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన షర్మిల
- ప్రజలను అమాయకులను చేసి, స్వార్థ రాజకీయాలకు పాల్పడితే ఇలాంటి తీర్పే వస్తుందని విమర్శ
- నియంత పాలనను గద్దె దించేందుకు తెలంగాణ సమాజం ఎదురు చూస్తోందన్న షర్మిల
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. బీజేపీ, బీఆర్ఎస్ లను విమర్శిస్తూ ట్వీట్ చేశారు. బీజేపీ మత రాజకీయాలకు, బీఆర్ఎస్ కుట్ర రాజకీయాలకు కర్ణాటక ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు అని అభిప్రాయపడ్డారు. ప్రజలను అమాయకులను చేసి, స్వార్థ రాజకీయాలకు పాల్పడితే ఇలాంటి తీర్పే వెలువడుతుందని అన్నారు.
‘కులం, మతం, డబ్బు, అధికారమదంతో ప్రజాస్వామ్యాన్ని కొనలేరు. నియంత పాలనను గద్దె దించేందుకు తెలంగాణ సమాజం సైతం ఎదురుచూస్తోంది’ అని షర్మిల ట్వీట్ చేశారు. కాగా, కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించిన కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.