ది కేరళ స్టోరీ వసూళ్లు తగ్గేదేలే.. 9 రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్​లోకి

  • సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన చిత్రం
  • హిందీ సహా పలు భాషల్లో ఈ నెల 5న విడుదల
  • వివాదాలు, విమర్శలు వచ్చినా వసూళ్లలో అదే జోరు
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. ఎన్నో వివాదాలు, గొడవలు, కోర్టు కేసుల మధ్య విడుదలైన చిత్రం సంచలనం సృష్టించింది. కొన్ని రాష్ట్రాలు చిత్రాన్ని బ్యాన్ చేసినా, మరికొన్ని చోట్ల అనేక ఆంక్షలు విధించినా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఆదాశర్మ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం ఎనిమిది రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరింది. సుదీప్తో సేన్ దర్శకత్వం కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండిస్తోంది.

రెండో వారంలోకి ఎంటరైన ఈ చిత్రం శుక్రవారం రూ.12.35 కోట్లు రాబట్టింది. శనివారం మరింత పెరిగి రూ.19.50 కోట్లు వసూలు చేసింది. దాంతో, మొత్తం కలెక్షన్లు రూ. 112.99 కోట్లు రాబట్టింది. దాంతో, ఈ ఏడాది వంద కోట్లు వసూళ్లు చేసిన నాలుగో బాలీవుడ్ సినిమాగా నిలిచింది. జనవరిలో పఠాన్, మార్చిలో తుజోతీ మెయిన్ మక్కర్, ఏప్రిల్ లో కిసీకా భాయ్ కిసీగా జాన్ వంద కోట్ల పైచిలుకు రాబట్టాయి.


More Telugu News