అవుకు రిజర్వాయర్ లో పడవ బోల్తా... ఇద్దరు మృతి
- నీటిలో పడిపోయిన 11 మంది పర్యాటకులు
- సహాయక చర్యలు చేపట్టిన అధికారులు
- ఒడ్డుకు చేరిన తర్వాత ఓ మహిళ మృతి... చికిత్స పొందుతూ మరో మహిళ కన్నుమూత
- విహారయాత్రకు వచ్చిన తంజావూరు వాసులు
ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలోని అవుకు రిజర్వాయర్ లో ప్రమాదం చోటుచేసుకుంది. 12 మంది వెళుతున్న పర్యాటకుల పడవ ఒకటి బోల్తా పడింది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. 11 మందిని ఒడ్డుకు చేర్చాయి. అయితే ఒడ్డుకు చేర్చిన తర్వాత ఓ మహిళ మృతి చెందింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో మహిళ మరణించింది. ఈ ఘటనలో మరొకరు గల్లంతు కాగా, ఆ వ్యక్తి కోసం కోసం గాలిస్తున్నారు.
ఆదివారం కావడంతో అవుకు రిజర్వాయర్ వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. తంజావూరు నుంచి వచ్చిన ఓ కుటుంబంతో పాటు మరికొందరు రిజర్వాయర్ లో పడవ విహారానికి వెళ్లారు. ఇంతలో పడవ బోల్తా పడడంతో వారంతా నీళ్లల్లో పడి గల్లంతయ్యారు. పర్యాటకులు లైఫ్ జాకెట్లు వేసుకోవడంతో అధిక ప్రాణనష్టం తప్పిందని అధికారులు తెలిపారు. కాగా, మరణించిన మహిళలను ఆశాబీ, నూర్జహాన్ గా గుర్తించారు.