ఈ నెల 17 నుంచి ఉద్యమబాట పట్టనున్న ఏపీ ఉద్యోగులు
- శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపడతామన్న ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు
- ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణ
- ఉద్యమానికి సంఘాలన్నీ కలిసి రావాలని పిలుపు
ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏపీ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టనున్నారు. ఈ నెల 17 నుంచి 30 వరకూ దశలవారీగా శాంతియుత ఉద్యమాలు చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆదివారం అనంతపురంలో మీడియాకు తెలిపారు.
నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని బొప్పరాజు విమర్శించారు. ఉద్యోగులు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వారి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. దీంతో, ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ఉద్యోగులు సిద్ధమైనట్టు ప్రకటించారు. ఉద్యమాలు చేస్తున్న ఉద్యోగులను అణిచివేసేందుకు కుట్ర జరుగుతోందన్న ఆయన, ఉద్యోగ సంఘాలన్నీ కలిసి ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మరొకసారి ఛలో విజయవాడ లాంటి ఆలోచన రాకముందే ప్రభుత్వం స్పందించాలని ఆయన సూచించారు.