టాపార్డర్ లో తలో చేయి వేశారు... సన్ రైజర్స్ భారీ స్కోరు
- ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ × లక్నో సూపర్ జెయింట్స్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
- ఓ మోస్తరుగా రాణించిన టాపార్డర్
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు
- ధాటిగా ఆడిన క్లాసెన్, సమద్
లక్నో సూపర్ జెయింట్స్ తో పోరులో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. టాపార్డర్ బ్యాట్స్ మెన్ తలో చేయి వేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లలో పెద్దగా పరుగులు చేయలేకపోవడంతో సన్ రైజర్స్ స్కోరు 200కి లోపే పరిమితమైంది.
ఓపెనర్ అభిషేక్ శర్మ (7) స్వల్ప స్కోరుకే అవుటైనా, మరో ఓపెనర్ అన్మోల్ ప్రీత్ సింగ్ 27 బంతుల్లో 7 ఫోర్లతో 36 పరుగులు సాధించాడు. రాహుల్ త్రిపాఠి 13 బంతుల్లో 4 ఫోర్లతో 20 పరుగులు చేయగా... కెప్టెన్ మార్ క్రమ్ 20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 28 పరుగులు నమోదు చేశాడు.
సన్ రైజర్స్ ఇన్నింగ్స్ లో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ హెన్రిచ్ క్లాసెన్ సాధించిన 47 పరుగులే అత్యధికం. ధాటిగా ఆడిన క్లాసెన్ 29 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. యువ బ్యాటర్ అబ్దుల్ సమద్ సైతం బ్యాట్ ఝుళిపించాడు. సమద్ 25 బంతుల్లో 37 పరుగులు చేశాడు. సమద్ ఏకంగా 1 ఫోర్, 4 సిక్సులు కొట్టడం విశేషం.
చివర్లో క్లాసెన్ అవుటయ్యాక స్కోరు వేగం మందగించింది. హార్డ్ హిట్టర్ గ్లెన్ ఫిలిప్స్ (0) ఆడిన తొలి బంతికే డకౌట్ అయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో కెప్టెన్ కృనాల్ పాండ్యా 2, యుధ్ వీర్ సింగ్ 1, అవేష్ ఖాన్ 1, యశ్ ఠాకూర్ 1, అమిత్ మిశ్రా 1 వికెట్ తీశారు.