విద్వేషం కథ ముగిసింది.. కర్ణాటకలో ప్రేమ దుకాణాలు తెరుచుకున్నాయి: రాహుల్ గాంధీ
- కర్ణాటకలో పేద ప్రజల శక్తి గెలిచిందన్న రాహుల్ గాంధీ
- తాము నిజాయతీతో, ప్రేమతో పోరాటం చేశామని వ్యాఖ్య
- అన్ని రాష్ట్రాల్లో ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని ధీమా
కర్ణాటక ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇది బలవంతులపై బలహీనులు సాధించిన విజయమని అన్నారు. పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కర్ణాటక ప్రజలకు అభినందనలు తెలిపారు.
ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ద్వేషంతో నడిచే మార్కెట్ మూతబడింది.. ప్రేమ దుకాణాలు తెరుచుకున్నాయి’’ అని అన్నారు. పేద ప్రజల శక్తి గెలిచిందని చెప్పారు.
తాము నిజాయతీతో, ప్రేమతో పోరాటం చేశామని, దాన్ని ప్రజలు స్వీకరించి ఇంత పెద్ద విజయం అందించారని పేర్కొన్నారు. పేదల కోసం కాంగ్రెస్ పోరాడిందని అన్నారు. ప్రేమతో కన్నడ ప్రజల మనసులు గెలుచుకున్నామని అన్నారు. ఈ ఫలితాలే అన్ని రాష్ట్రాల్లో రిపీట్ అవుతాయని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు.