ఇక ప్రతి మ్యాచ్ లో గెలిస్తేనే ప్లేఆఫ్ ఆశలు... లక్నోతో సన్ రైజర్స్ ఢీ
- హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
- పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న హైదరాబాద్ జట్టు
ఈ టోర్నీలో ఆశించిన స్థాయిలో రాణించని జట్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకటి. ఇప్పటిదాకా 10 మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ 4 మ్యాచ్ ల్లో గెలిచి 6 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. దాంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది.
ఇకపై తాను ఆడే ప్రతి మ్యాచ్ లో గెలిస్తేనే ప్లేఆఫ్ ఆశలు సజీవంగా నిలుస్తాయి. ఇతర జట్ల జయాపజయాలు కూడా సన్ రైజర్స్ అవకాశాలపై ప్రభావం చూపనున్నాయి.
ఈ నేపథ్యంలో, సన్ రైజర్స్ జట్టు నేడు సొంతగడ్డ ఉప్పల్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడుతోంది. ఈ పోరులో సన్ రైజర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 2 ఓవర్లు ముగిసేసరికి సన్ రైజర్స్ స్కోరు వికెట్ నష్టపోకుండా 19 పరుగులు. అన్మోల్ ప్రీత్ సింగ్ (10), అభిషేక్ శర్మ (7) క్రీజులో ఉన్నారు.