కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపవు: కేటీఆర్
- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జయభేరి
- కర్ణాటక నూతన ప్రభుత్వానికి శుభాభినందనలు అంటూ కేటీఆర్ స్పందన
- దరిద్రగొట్టు రాజకీయాలను కన్నడ ప్రజలు తిప్పికొట్టారని వ్యాఖ్య
- హైదరాబాద్, బెంగళూరు నగరాలను ఎదగనిద్దామని పిలుపు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని చిత్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. కర్ణాటకలో నూతనంగా ఏర్పాటు కానున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాభినందనలు తెలుపుతున్నట్టు వెల్లడించారు.
దరిద్రగొట్టు విభజన రాజకీయాలను తిప్పికొట్టిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని కేటీఆర్ వెల్లడించారు. అయితే, కేరళ స్టోరీ సినిమా కర్ణాటక ప్రజలను ఆకట్టుకోవడంలో ఎలా విఫలమైందో చూశామని, అదే విధంగా, కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ ప్రభావంపై చూపుతాయని అనుకోవడంలేదని అభిప్రాయపడ్డారు.
భారతదేశ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా హైదరాబాద్, బెంగళూరు నగరాలను మరింత ఎత్తుకు ఎదగనిద్దామని, ఆరోగ్యకరమైన పోటీతో పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పనలో ఇంకా ముందుకు వెళ్లేలా తోడ్పాటు అందిద్దామని పిలుపునిచ్చారు.