స్థానిక నేతలు మరింత కష్టపడి ఉండాల్సింది: కర్ణాటక ఫలితాలపై జీవీఎల్

  • మోదీ ఛరిష్మా పని చేస్తోందనే విషయం మరోసారి రుజువయిందన్న జీవీఎల్
  • అధికారంలో ఉన్న పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కష్టతరమని వ్యాఖ్య
  • ఫలితాలు వెలువడిన తర్వాత పూర్తి స్థాయి విశ్లేషణ చేస్తామన్న జీవీఎల్
 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా వెలువడుతున్నాయి. 124 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందిస్తూ... ప్రధాని మోదీ ఛరిష్మా పనిచేస్తుందనే విషయాన్ని కర్ణాటక ఎన్నికలు మరోసారి రుజువు చేశాయని అన్నారు. అధికారంలో ఉన్న పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కష్టతరమని చెప్పారు. స్థానిక నేతలు మరింత కష్టపడి ఉండాల్సిందని అన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి స్థానాలు తగ్గాయనే విషయం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ఫలితాలు పూర్తిగా వెలువడిన తర్వాత పూర్తి స్థాయి విశ్లేషణ చేస్తామని అన్నారు.


More Telugu News