నాకు అంత డిమాండ్ లేదు: కుమారస్వామి

  • తాను ఏ పార్టీతోనూ టచ్ లో లేనన్న కుమారస్వామి
  • ఏ పార్టీ తనను సంప్రదించలేదని స్పష్టీకరణ
  • ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఇతర పార్టీలకు తమ అవసరం ఉండకపోవచ్చని వ్యాఖ్య
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి బెంగళూరులోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒకవేళ కర్ణాటకలో హంగ్ వస్తే జేడీఎస్ కింగ్ మేకర్ పాత్రను పోషిస్తుందనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ ఉదయం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీతోనూ టచ్ లో లేనని... ఏ పార్టీ కూడా తనను సంప్రదించలేదని ఆయన అన్నారు. 

రెండు, మూడు గంటలు గడిస్తే క్లియర్ పిక్ఛర్ వస్తుందని కుమారస్వామి చెప్పారు. రెండు జాతీయ పార్టీలకు ఎక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయని... తమ జేడీఎస్ కు 30 నుంచి 32 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పాయని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం తమ పార్టీ అవసరం ఇతర పార్టీలకు రాకపోవచ్చని చెప్పారు. తమది ఒక చిన్న పార్టీ అని... తనకు అంత డిమాండ్ లేదని వ్యాఖ్యానించారు.


More Telugu News