వీరబాదుడుతో రికార్డులు బద్దలుగొట్టిన గుజరాత్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్
- 32 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్లతో 79 పరుగులు చేసిన రషీద్ ఖాన్
- ఆ ఘనత సాధించిన ఐదో జాయింట్ ప్లేయర్‌గా ఆఫ్ఘన్ ఆల్‌రౌండర్
- జట్టు ఓడిపోయిన దశలో ఆ ఘనత సాధించిన మూడో ప్లేయర్‌గా రికార్డు
- ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా గత రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడైన బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ ఈ మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించి రికార్డులు బద్దలుగొట్టాడు.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఐపీఎల్‌లో అతికొద్దిమంది మాత్రమే సాధించిన ఘనతను రషీద్ ఖాన్ సొంతం చేసుకున్నాడు. ఒక మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసుకోవడంతోపాటు అర్ధ సెంచరీ సాధించిన ఐదో ఆటగాడిగా మరికొందరితో కలిసి రికార్డు పంచుకున్నాడు. రషీద్ ఖాన్ శివాలెత్తినప్పటికీ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు.
సూర్యకుమార్ యాదవ్ సెంచరీ (49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 103 పరుగులు)తో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 5 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేయగలిగింది.
8వ నంబరులో బ్యాటింగ్‌కు వచ్చిన రషీద్ ఖాన్ వరుస సిక్సర్లతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 32 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్లతో 79 పరుగులు చేసి ముంబైని వణికించాడు. ఈ అద్భుత ప్రదర్శన ఎలైట్ లిస్టులో అతడి పేరు చేరేందుకు సాయ పడింది. ఐపీఎల్‌లో ఒక మ్యాచ్‌లో 4 వికెట్లు తీయడంతోపాటు 50కిపైగా పరుగులు సాధించిన ఐదో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అలాగే, జట్టు ఓడిపోయిన దశలో ఆ ఘనత సాధించి మూడో క్రికెటర్‌గానూ అతడి పేరు రికార్డుల్లో చేరింది.
ఒక మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీయడంతోపాటు 50కిపైగా పరుగులు సాధించిన వారిలో రషీద్ ఖాన్ కంటే ముందు డెక్కన్ చార్జర్స్‌పై పాల్ వాల్తాటీ (2011), ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై యువరాజ్ సింగ్ (2011), 2012లో రాజస్థాన్ రాయల్స్‌పై కీరన్ పొలార్డ్, 2014లో రాజస్థాన్ రాయల్స్‌పై యువరాజ్ సింగ్, 2015లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై జేపీ డుమిని, ఈ సీజన్‌లో రషీద్‌ఖాన్‌కు ముందు హైదరాబాద్‌పై మిచెల్ మార్ష్ ఈ ఘనత సాధించారు.
అలాగే, ఈ సీజన్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును కూడా రషీద్ సొంతం చేసుకున్నాడు. చెన్నై బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్, కేకేఆర్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ 9 సిక్సర్ల చొప్పున నమోదు చేశారు.