విధులకు హాజరుకాని జేపీఎస్ ల స్థానాల్లో కొత్తవారు... తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

  • విధులకు హాజరైన వారి జాబితాను పంపించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు
  • సమ్మె విరమించని వారితో ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం
  • గతంలో జేపీఎస్ పరీక్ష రాసిన వారికి మొదటి ప్రాధాన్యత
జూనియర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు లేదా జేపీఎస్ అంశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విధులకు హాజరైన వారి జాబితాను శనివారం మధ్యాహ్నం లోగా పంపించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. సమ్మె విరమించని వారితో ఇక నుండి ఎలాంటి సంబంధం ఉండబోదని స్పష్టం చేసింది. విధులకు హాజరుకాని వారి స్థానాల్లో కొత్తవారిని తాత్కాలిక కార్యదర్శులుగా నియమించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గతంలో జేపీఎస్ పరీక్ష రాసిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించింది.


More Telugu News