మొదటి ఎర్రిపప్ప తాడేపల్లిలో ఉన్నాడు... రెండో ఎర్రిపప్ప ఇక్కడ ఉన్నాడు: చంద్రబాబు
- తణుకులో రైతు పోరు బాట
- 12 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన చంద్రబాబు
- అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరామర్శ
- చంద్రబాబుకు తమ కష్టాలు చెప్పుకున్న రైతులు
- జగన్, కారుమూరిపై చంద్రబాబు విసుర్లు
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తణుకులో రైతు పోరుబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరగవరం నుంచి తణుకు వరకు 12 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. చంద్రబాబు దారి పొడవునా అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులతో మాట్లాడారు. చంద్రబాబుకు రైతులు తమ కష్టాలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.
చంద్రబాబు ప్రసంగం హైలైట్స్...
• ధాన్యంలో తేమ ఉన్నా, మొలక వచ్చినా కొంటాము అని ప్రకటన ఇచ్చారు. ఆ ధాన్యం కొన్నారా అని నేను అడుగుతున్నా
• మనం పంట అమ్మితే మనకు డబ్బులు ఇవ్వాలి. కానీ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే... మన దగ్గర నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు.
• లారీకి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు.
• ఆర్బీకేల వల్ల రైతులకు ఏం లాభం వచ్చిందో చెప్పాలి. ఆర్బీకే కేంద్రాలు దగా కేంద్రాలు అయ్యాయి.
• ఈ సభ ద్వారా ఈ ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలు అడుగుతున్నా
• అకాల వర్షాల వల్ల ఎంత నష్టం జరిగింది? ఎంత మంది రైతులు నష్టపోయారు? 4 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు తెలుస్తోంది... ప్రభుత్వం ఎందుకు అధికారికంగా ప్రకటించడం లేదు?
• విపత్తులు వచ్చినప్పుడు ప్రత్యేకంగా జీవోలు ఇచ్చి సాయం చేస్తాం. కానీ ఈ ప్రభుత్వం ఈ అకాల వర్షాలకు ఎందుకు ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చి ఆదుకోలేదు?
• ఏప్రిల్ 1 వ తేదీన రబీ ధాన్యం సేకరించాలి. కానీ ఎందుకు ధాన్యం సేకరణ చేపట్టలేదు.?
• కేజీ చక్కెర కొంటే కేజీనే ఇస్తారు... కానీ ఇక్కడ ధాన్యం సంచికి 40 కేజీలకు 42 కేజీలు ఎందుకు తీసుకుంటున్నారు?
• తేమ, తరుగు, నూక పేరుతో అదనంగా డబ్బులు గుంజుతున్నారు. దీని వల్ల బస్తాకు రూ.200 నుంచి రూ. 300 పోతుంది. అంటే ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.20 వేల నష్టం వస్తుంది. ప్రభుత్వం నాపై దాడి చేయడం కాదు. దీనికి సమాధానం చెప్పాలి
• చేతనైతే నాతో పోటీపడి రైతులకు సాయం చేయాలి కానీ నాపై విమర్శలు కాదు.
• నేటి ఈ పాదయాత్ర... వైసీపీ ప్రభుత్వానికి అంతిమ యాత్ర అవుతుంది.
• రైతుల పంటలకు బీమా అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ ప్రభుత్వం బీమా కట్టడం లేదు.
• ఈ ముఖ్యమంత్రి లేచింది మొదలు చెప్పేది అసత్యాలే. ఈ సీఎం కళ్లార్పకుండా అబద్ధాలు చెపుతాడు. ఒక్క బాబాయి కేసులోనే ఎన్ని అబద్ధాలు చెప్పాడో చూశాం.
• ఈ సమావేశం ద్వారా అడుగుతున్నా రబీకి ఇన్స్యూరెన్స్ కట్టారా... ఏ పొలంలో అయినా క్రాప్ కటింగ్ ఎక్సపెరిమెంట్ జరిగిందా ?
• ప్రభుత్వం ధాన్యం సేకరణలో రైతుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని రైతుకు తిరిగి ఇవ్వాలి.
• రవాణా ఖర్చులు, తరుగు, నూక పేరుతో వసూలు చేసిన మొత్తాలను రైతుకు చెల్లించాలి
• జగన్ కు అర్థం కాకపోవచ్చు... కానీ నేర్చుకోవాలనే ఆలోచన లేదు.
• ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనాలి... కొన్న ధాన్యానికి వెంటనే మద్దతు ధర రైతుకు చెల్లించాలి.
• మీ డబ్బులు ఇప్పించడానికి నేను సిద్దంగా ఉన్నా.....రైతులు కూడా నాతో కలిసి పోరాటానికి కదలిరావాలి.
• రైతాంగంలో ధైర్యం రావాలి... ఈ ప్రభుత్వం బెదిరిస్తుందని భయపడకండి. సమస్యలపై నిరసనలు తెలిపే హక్కు రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ ఇచ్చింది.
• ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు... పోలీసులను పెట్టి రైతులను బెదిరించాడు, ఇలాంటి వాళ్లను నా జీవితంలో చాలా మందిని చూశా
• నేరస్తుడికి అధికారం ఇవ్వొద్దంటే నాడు మీరంతా వినలేదు, ఒక చాన్స్ అంటే కరిగిపోవద్దు అని నాడే చెప్పాను. ఒక్క చాన్స్ అని కరెంట్ తీగను పట్టుకుంటే ఏమవుతుంది... ఇప్పుడు అదే అయ్యింది.
• ఈ ప్రభుత్వానికి నాలుగు డిమాండ్లు పెడుతున్నాను.
• దెబ్బతిన్న మొక్కజొన్న, జొన్న, వరికి ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలి
• హార్టికల్చర్ పంటలకు ఎకరానికి రూ.50 వేలు ఇవ్వాలి
• ఇన్ స్యూరెన్స్ కట్టలేదు కాబట్టి... నష్టపరిహారం ప్రభుత్వమే ఇవ్వాలి.
• ఈ ప్రభుత్వం ఇచ్చే వరకు మనం పోరాడుదాం... ప్రభుత్వం అప్పటికీ ఇవ్వకపోతే...మన ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ నష్టపరిహారం ఇస్తాం.
• ఇప్పుడు చుక్కల భూములు అంటున్నాడు... సర్వే అంటున్నాడు. ఈ విషయంలో కూడా అక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
• జగన్ కు పిచ్చి ముదిరింది... ఫ్రస్టేషన్ పీక్ కు వెళ్లింది.
• నేను రైతు వ్యతిరేకి అని జగన్ అంటున్నాడు... నేను 5 ఏళ్లు ఏం చేశానో.... నువ్వు ఏం చేశావో చర్చకు సిద్దమా ?
• నాడు మైక్రో ఇరిగేషన్ కు 90 శాతం సబ్సిడీ ఇచ్చాం....యంత్రాలు ఇచ్చాం....రైతులకు ట్రాక్టర్లు ఇచ్చాం.
• రైతుకు అండగా నిలిచినపార్టీ టీడీపీ... రైతును నిండాముంచిన పార్టీ వైసీపీ
• మళ్లీ జగన్ గెలిచేది లేదు... జగన్ పని అయిపోయింది.
• ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు...అతను ఎర్రిపప్ప. అంటే అర్థం బుజ్జినాన్న.
• ఇతను వెర్రిపప్పా... బుజ్జినాన్నా? మా అచ్చెన్న చెప్పినట్లు మొదటి ఎర్రిపప్ప తాడేపల్లిలో ఉన్నాడు... రెండో వెర్రిపప్ప ఇక్కడ ఉన్నాడు
• రైతులపై ప్రేమ ఉంటే వెంటనే జగన్ కారుమూరిని మంత్రిపదవి నుంచి తొలగించాలి
• మంత్రిగా ఉండి సొంత నియోజకవర్గంలో ధాన్యం కొనలేని మంత్రి మనపై విమర్శలు చేస్తున్నాడు
• 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.... ఈ మంత్రులు నన్ను బెదిరిస్తారా?
• ఈ మంత్రి అనుకుంటే నేను తణుకు దాటనా... తీవ్ర వాదులతో పోరాడిన పార్టీ టీడీపీ. ఆకు రౌడీలకు భయపడతానా?
• రౌడీయిజం చేస్తున్న వైసీపీ నేతల తప్పులు అన్నీ లెక్క పెడుతున్నా... అన్నిటికీ బదులిస్తా.
• ఈ రోజు సభ నుంచి చెపుతున్నా... కౌలు రైతును ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా