నష్టాల్లోకి జారుకుని చివరకు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 123 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 18 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 2.78 శాతం పతనమైన పవర్ గ్రిడ్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో నెమ్మదిగా సూచీలు పుంజుకున్నాయి. బ్యాంకింగ్, వాహన రంగ షేర్లు రాణించడం మార్కెట్లకు మద్దతుగా నిలిచింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 123 పాయింట్ల లాభంతో 62,028కి చేరుకుంది. నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 18,315 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (1.91%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.81%), యాక్సిస్ బ్యాంక్ (1.69%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.22%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.90%).
టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.78%), ఎన్టీపీసీ (-2.34%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.70%), టాటా స్టీల్ (-1.66%), నెస్లే ఇండియా (-1.19%).