కేసీఆర్ ముఖ్య సలహాదారుగా బాధ్యతలను స్వీకరించిన సోమేశ్ కుమార్

  • ఇటీవలే స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సోమేశ్ కుమార్
  • తెలంగాణ సీఎస్ గా సుదీర్ఘ కాలం కొనసాగిన వైనం
  • సోమేశ్ కుమార్ అనుభవానికి పెద్దపీట వేసిన కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముఖ్య సలహాదారుగా మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ బాధ్యతలను స్వీకరించారు. ఈ ఉదయం ఆయన కొత్త బాధ్యతలను చేపట్టారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో వుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత సోమేశ్ కుమార్ ను ఏపీకి కేటాయించారు. అయినప్పటికీ క్యాట్ ఉత్తర్వుల మేరకు ఆయన తెలంగాణలోనే కొనసాగారు. 

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ సుదీర్ఘ కాలం పని చేశారు. అయితే, ఆయనను తెలంగాణలో కొనసాగిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను డీవోపీటీ తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో తక్షణమే ఏపీలో రిపోర్ట్ చేయాలంటూ సోమేశ్ కుమార్ ను హైకోర్టు ఆదేశించింది.

దీంతో సోమేశ్ కుమార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ జీఏడీలో రిపోర్ట్ చేశారు. అయితే సీఎస్ గా పని చేసిన ఆయన.. అంతకంటే తక్కువ పోస్టులో పని చేయడానికి ఇష్టపడలేదు. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. కొన్ని రోజుల తర్వాత ఆయన స్వచ్చంద పదవీ విరమణ చేశారు. తాజాగా ఆయనకు కేసీఆర్ తన ముఖ్య సలహాదారుడిగా బాధ్యతలను అప్పగించారు.


More Telugu News