ఎలాన్ మస్క్ చెబుతున్న కొత్త సీఈవో ఈమేనా?
- ట్విట్టర్‌ను గతేడాది సొంతం చేసుకున్న మస్క్
- మరో ఆరు వారాల్లో కొత్త సీఈవో వస్తున్నట్టు మస్క్ ట్వీట్
- ఆ కొత్తబాస్ లిండానేనంటూ వార్తలు
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను గతేడాది సొంతం చేసుకున్నప్పటి నుంచి దానికి సీఈవోగా కొనసాగుతున్న ఎలాన్ మాస్క్ తాజాగా ఓ హింట్ ఇచ్చారు. సీఈవో స్థానంలో మరొకరిని కూర్చోబెట్టి తాను మరో పాత్రలో బిజీ అవుతానని చెప్పారు. ఆయనా విషయం వెల్లడించినప్పటి నుంచి మస్క్ ఎంచుకున్న ఆ సీఈవో ఎవరంటూ చర్చ మొదలైంది. ఈ చర్చ చివరికి అమెరికన్ మల్టీ నేషనల్ కంపెనీ ఎన్‌బీసీ యూనివర్సల్‌లోని గ్లోబల్ అడ్వర్టైజింగ్ అండ్ పార్ట్‌నర్‌షిప్స్ ప్రస్తుత చైర్మన్ లిండా యకారినో వద్ద ఆగింది. ట్విట్టర్ తదుపరి సీఈవో ఆమెనంటూ సోషల్ మీడియా హోరెత్తిస్తోంది.
మస్క్ నిన్న ఓ ట్వీట్ చేస్తూ.. ట్విట్టర్‌కు కొత్త సీఈవోను నియమించినట్టు చెప్పేందుకు సంతోషిస్తున్నట్టు పేర్కొన్నారు. మరో ఆరు వారాల్లో ఆమె బాధ్యతలు స్వీకరిస్తారని, తాను సాఫ్ట్‌వేర్, సిసోప్‌లను పర్యవేక్షిస్తూ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సీటీవోగా మారుతానని పేర్కొన్నారు. మస్క్ ఇంత చెప్పినా ఆ కొత్త సీఈవో ఎవరన్న విషయాన్ని మాత్రం రహస్యంగా ఉంచారు. దీంతో రూమర్లు బయటకొచ్చాయి. ఆ కొత్త సీఈవో మరెవరో కాదని, లిండాయేనని జర్నలిస్ట్, సిలికాన్ వ్యాలీ ఇన్‌సైడర్ కారా స్విషర్ చెప్పుకొచ్చారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ కూడా యకారియోనోనే ట్విట్టర్ తదుపరి సీఈవో అని పేర్కొంది.