‘అగ్నివీర్’లకు శుభవార్త.. రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్

  • రైల్వేలో నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో 15 శాతం రిజర్వేషన్
  • వయో పరిమితిలోనూ సడలింపు
  • దేహదారుఢ్య పరీక్షల నుంచి మినహాయింపు
  • అగ్నివీర్‌లకు రిజర్వేషన్ యోచనలో ఆర్పీఎఫ్
‘అగ్నివీర్’లకు కేంద్రం శుభవార్త చెప్పింది. నాన్-గెజిటెడ్ ఉద్యోగాల్లో రెండంచెల్లో 15 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. అలాగే, వయో పరిమితిలో సడలింపుతోపాటు దేహదారుఢ్య పరీక్షల నుంచి కూడా వారికి మినహాయింపు లభించనుంది. దివ్యాంగులు, మాజీ సైనికులు, యాక్ట్ అప్రంటీస్ కోర్సు పూర్తి చేసిన వారితో సమానంగా లెవల్-1లో 10 శాతం, లెవల్-2, ఆపైన నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్ లభించనుంది.

అగ్నివీర్ తొలి బ్యాచ్ వారికి ఐదు సంవత్సరాలు, తర్వాత బ్యాచ్‌ల నుంచి మూడేళ్ల చొప్పున వయోపరిమితిపై సడలింపు లభిస్తుంది. అయితే, నాలుగేళ్లు అగ్నివీర్‌లుగా ఉన్న వారికే ఈ సడలింపు లభించనుంది. అలాగే, ఆర్పీఎఫ్ కూడా అగ్నివీర్‌ల కోసం రిజర్వేషన్ కల్పించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.


More Telugu News