ఒరిజినల్ రవితేజ అనుకుని హరీశ్ శంకర్ ఎలా స్పందించాడో చూడండి!
- పవన్ కల్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం
- ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న హరీశ్ శంకర్
- తాజాగా గ్లింప్స్ వీడియో విడుదల
- హరీశ్ శంకర్ పై ప్రశంసలు
- రవితేజ అనే పేరుతో ఉన్న బ్లూ టిక్ అకౌంట్ నుంచి కూడా ఓ ప్రశంస
పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ ఓ పవర్ ఫుల్ సబ్జెక్టుతో ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తుండడం తెలిసిందే. ఈ చిత్రం నుంచి ఇవాళ గ్లింప్స్ వీడియో రిలీజైంది. ఈ వీడియో పవర్ స్టార్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది అంటూ పవన్ చెప్పిన డైలాగ్ తో సినిమా ఎలా ఉంటుందో ఫ్యాన్స్ ఓ అంచనాకు వస్తున్నారు. పవన్ క్రేజ్ కు తగ్గకుండా సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడంటూ దర్శకుడు హరీశ్ శంకర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
కాగా, సోషల్ మీడియాలో రవితేజ పేరిట బ్లూ టిక్ ఉన్న అకౌంట్ నుంచి హరీశ్ శంకర్ కు ఓ ప్రశంస వచ్చింది. గబ్బర్ సింగ్ ను మించిపోయే హిట్ కోసం హరీశ్ శంకర్ ప్లాన్ చేస్తున్నాడు... గుడ్ లక్ అంటూ ఆ ట్వీట్ సారాంశం.
అయితే ఈ ట్వీట్ చేసింది మాస్ మహారాజా రవితేజ అనుకుని హరీశ్ శంకర్ పొరబడ్డారు. "అన్నయ్యా... ఈ మొక్క నువ్వు నాటిన మొక్క... ఎన్ని సార్లయినా చెబుతా ఇదే ముక్క" అంటూ ఎమోషనల్ అయ్యారు. "మాస్ మహారాజా రవితేజకు మరొక్కసారి కృతజ్ఞతలు" అంటూ హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు.
నెటిజన్లు మాత్రం హరీశ్ శంకర్ పొరబడిన విషయాన్ని గుర్తించారు. అది రవితేజ ఒరిజినల్ ఐడీ కాదని కామెంట్స్ సెక్షన్ లో పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ బ్లూ టిక్ ఇస్తే ఇలాగే ఉంటుందని మరికొందరు అభిప్రాయపడ్డారు.
హరీశ్ శంకర్ దర్శకత్వ కెరీర్ ఆరంభించింది రవితేజ సినిమాతోనే అని తెలిసిందే. ఆ సినిమా పేరు షాక్. ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే ఓ డిజాస్టర్ గా మిగిలిపోయింది. అయితే, తనకు దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చింది రవితేజేనన్న కృతజ్ఞతాభావంతో హరీశ్ శంకర్ ఈ ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది.
బ్లూ టిక్ ఉన్నప్పటికీ అది హీరో రవితేజ అఫిషియల్ అకౌంట్ కాదు. అమెరికాలో ఉండే వ్యక్తిది. అతడికి ఫాలోవర్లు కేవలం 300 మందే ఉన్నారు.