చిన్న తనంలో అధిక బరువు.. పెద్దయితే ఆరోగ్య సమస్యలు!
- చిన్నారుల్లో పెరిగిపోతున్న అధిక బరువు సమస్య
- దీనివల్ల పెద్దయిన తర్వాత కాలేయం, గుండె జబ్బులు
- మధుమేహం, ఇతర జీవనశైలి వ్యాధుల ముప్పు
- హెచ్చరిస్తున్న అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్
అధిక బరువుతో ఉండే చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరాన్ని వైద్యులు తెలియజేస్తున్నారు. చిన్నతనంలో స్థూలకాయం సమస్య ఎదురైతే, అలాంటి చిన్నారులు పెద్ద అయిన తర్వాత ఎన్నో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (చిన్న పిల్లల వైద్యులకు సంబంధించి ప్రముఖ అసోసియేషన్) హెచ్చరిస్తోంది.
గతంతో పోలిస్తే చిన్నారులలో అధిక బరువు సమస్య పెరుగుతున్నట్టు చెబుతున్నారు. ఈ విషయంలో అనుసరించాల్సిన మర్గదర్శకాలను వారు విడుదల చేశారు. చిన్న వయసులో స్థూలకాయం ఉన్న ప్రతీ చిన్నారికీ పెద్దయిన తర్వాత ఆరోగ్య సమస్యలు వస్తాయన్న గ్యారంటీ లేదు. కాకపోతే అధిక బరువు సమస్యతో బాధపడేవారికి రిస్క్ ఉంటుందని అర్థం చేసుకోవాలి.
చిన్న పిల్లలు వయసు ఆధారంగా ఎంత ఎత్తు, బరువు సహజంగా ఉండాలో వైద్యులను అడిగి తెలుసుకోవచ్చు. ఆన్ లైన్ లోనూ గ్రోత్ చార్ట్ లు లభిస్తాయి. వాటిని చూసి అయినా తెలుసుకోవచ్చు. కాలేయం సమస్యలు, గుండె జబ్బులు, జీవక్రియల సమస్యలు అయిన మధుమేహం, రక్తపోటు బారిన పడే రిస్క్ అధికంగా ఉంటుంది. అలాగే, స్లీప్ ఆప్నియా, ఎముకలు, కీళ్లు, మూత్రపిండాల సమస్యలు కూడా రావచ్చు. అధిక బరువు ఉన్న వారిలో కాలేయంలో కొవ్వు ఎక్కువగా పేరుకుంటుంది. దీనివల్ల ఫ్యాటీ లివర్ సమస్య కనిపించొచ్చు. కనుక చార్ట్ ప్రకారం తమ పిల్లలు పరిమితికి మించి బరువు ఉంటే ఒకసారి వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.