నేనెప్పుడూ సూసైడ్ ప్రయత్నం చేయలేదు: హీరో సుమన్
- యాక్షన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమన్
- ఫ్యామిలీ హీరోగాను మార్కులు కొట్టేసిన హీరో
- జీవితంలోని ఒడిదుడుకులపై ప్రస్తావన
- మార్షల్ ఆర్ట్స్ తనకి ఎంతో ఉపయోగపడిందని వెల్లడి
టాలీవుడ్ లోని సీనియర్ స్టార్ హీరోలలో సుమన్ ఒకరు. మంచి హైటూ .. అందుకు తగిన పర్సనాలిటీ సుమన్ సొంతం. యాక్షన్ హీరోగా తెలుగు తెరకి పరిచయమైన సుమన్, ఆ తరువాత ఫ్యామిలీ హీరోగా కూడా ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
"మితంగా తినడం .. సమయానికి తినడం .. వ్యాయామం చేయడం .. తగినంత నిద్రపోవడం నా ఆరోగ్య రహస్యం. 45 ఏళ్ల నా కెరియర్లో ఎన్నో ఒడిదుడుకులు చూశాను .. ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలబడ్డాను. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నాను. ఎవరితోనూ నన్ను నేను పోల్చుకోకుండా నాకు వచ్చిన పాత్రలను చేస్తూ వెళ్లాను. అంకితభావంతో .. క్రమశిక్షణతో పనిచేశాను" అని చెప్పారు.
జీవితంలో కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు నేను ఆత్మహత్య చేసుకోవటానికి ట్రై చేశాననే ప్రచారం జరిగింది. అందులో ఎంతమాత్రం నిజం లేదు. నేను ఎప్పుడూ అలాంటి ఆలోచన చేయలేదు. క్రిందపడినప్పుడు ఎలా పైకి లేవాలనేది మార్షల్ ఆర్ట్స్ లో ఒక భాగంగా ఉంటుంది. శారీరకంగా మాత్రమే కాదు .. మానసికంగాను అది బలాన్ని ఇస్తుంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం నాకు ఎంతో హెల్ప్ అయింది" అంటూ చెప్పుకొచ్చారు.