గరుడపురాణంతో ముడిపడిన కథ .. అంచనాలు పెంచుతున్న 'ఊరుపేరు భైరవకోన'

  • వీఐ ఆనంద్ నుంచి మరో ప్రయోగాత్మక చిత్రం
  • టైటిల్ తోనే ఆసక్తిని పెంచిన 'ఊరుపేరు భైరవకోన'
  • ఉత్కంఠను పెంచుతున్న టీజర్  
  • హిట్ ఖాయమనే నమ్మకంతో ఉన్న సందీప్ కిషన్
టాలీవుడ్ దర్శకులలో వీఐ ఆనంద్ స్థానం ప్రత్యేకం. ఆయన తయారు చేసుకునే కథలు .. తెరపై వాటిని ఆవిష్కరించే విధానం కొత్తగా ఉంటాయి. వీఐ ఆనంద్ సినిమాలు రోటీన్ కథలకు దూరంగా కనిపిస్తాయి. కంటెంట్ కొత్తగా ఉందే అనుకుంటూ ఆయన సినిమాల కోసం ఎదురుచూసేలా చేస్తాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' .. 'ఒక్క క్షణం' సినిమాలు చూస్తే ఈ విషయమే మనకి అర్థమవుతుంది. 

అలాంటి వీఐ ఆనంద్ మరో ఇంట్రెస్టింగ్ లైన్ తో 'ఊరుపేరు భైరవకోన' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి రెడీ అవుతున్నాడు. రీసెంట్ గా వదిలిన టీజర్ ద్వారా ఇది గరుడపురాణంతో ముడిపడిన కథ అని తెలుస్తోంది. 'కృష్ణదేవరాయల కాలంలోని గరుడపురాణానికీ .. ఇప్పటి గరుడ పురాణానికి నాలుగు పేజీలు తగ్గాయి' అంటూ ఆ నాలుగు పేజీల్లో ఏముందనే ఒక ఆసక్తిని పెంచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

అప్పటి గరుడపురాణంలోని ఆ నాలుగు పేజీలు ఎలా మిస్సయ్యాయి? ఆ నాలుగు పేజీలతో 'భైరవకోన'కి ఉన్న సంబంధం ఏమిటనేది కథ. టీజర్ తరువాత సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. నైట్ ఎఫెక్ట్ సీన్స్ సినిమాపై మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి. గత కొంతకాలంగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న సందీప్ కిషన్ కి, ఈ సినిమాతో హిట్ పడటం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.


More Telugu News