గూగుల్ పిక్సల్ 6ఏపై రూ.16,000 తగ్గింపు.. పిక్సల్ 7ఏ విడుదల
- గూగుల్ పిక్సల్ 6ఏ ధర ఇప్పుడు రూ.27,999
- పిక్సల్ 7ఏ ఆఫర్ ధర రూ.39,999
- ఏడాది పాటు ఉచిత స్క్రీన్ రీప్లెస్ మెంట్
- రూ.3,999కే ఫిట్ బిట్ ఇన్ స్పైర్ 2
గూగుల్ పిక్సల్ అభిమానులకు గుడ్ న్యూస్. పిక్సల్ 6ఏ ధర భారీగా తగ్గింది. నిన్నటి కార్యక్రమంలో పిక్సల్ 7ఏ ను గూగుల్ ఆవిష్కరించింది. దీని ధర రూ.43,999. బ్యాంకు ఆఫర్లను వినియోగించుకోవడం ద్వారా కేవలం రూ.39,999కే సొంతం చేసుకోవచ్చు. కొత్త వెర్షన్ ను విడుదల చేయడంతో పిక్సల్ 6ఏ ధరను గూగుల్ తగ్గించింది. గతేడాది రూ.43,999కు విడుదలైన పిక్సల్ 6ఏ ధరను రూ.16,000 తగ్గించింది. దీంతో ఇప్పుడు పిక్సల్ 6ఏని రూ.27,999కు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో వస్తుంది. 2022 మూడో త్రైమాసికంలో పిక్సల్ 6ఏని గూగుల్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయగా, ఇప్పటి వరకు కోటి యూనిట్లను విక్రయించినట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అనే సంస్థ వెల్లడించింది.
ఇక గూగుల్ పిక్సల్ 7ఏ వాస్తవ ధర రూ.43,999 అయినా హెచ్ డీఎఫ్ సీ కార్డుపై రూ.4,000 డిస్కౌంట్ వస్తుంది. పిక్సల్ 7ఏ కొనుగోలు చేసే వారికి ఫిట్ బిట్ ఇన్ స్పైర్ 2 కేవలం రూ.3,999కు లభిస్తుంది. లేదంటే పిక్సల్ బడ్స్ ఏ సిరీస్ ను అదే ధరకు సొంతం చేసుకోవచ్చు. ఏడాది పాటు ఉచిత స్క్రీన్ రీప్లేస్ మెంట్ ఆఫర్ ను కూడా గూగుల్ ఇస్తోంది. మూడు నెలల పాటు యూట్యూబ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ను కూడా ఉచితంగా ఇస్తోంది. పిక్సల్ 7ఏలో టెన్సార్ జీ2 చిప్ సెట్ (గూగుల్ సొంతం)ను ఏర్పాటు చేశారు. స్క్రీన్ 6.1 అంగుళాలతో ఉంటుంది. 90 హెర్జ్ రీఫ్రెష్ రేటు, ఐపీ67 రేటింగ్, వైర్ లెస్ చార్జింగ్, ఫేస్ అన్ లాక్ తదితర ఫీచర్లు ఉన్నాయి.