పగ, కోపానికి సమయం లేదు.. : విరాట్ కోహ్లీ
- ప్రముఖ అమెరికా నటుడు కెవిన్ హార్ట్ వీడియో షేర్ చేసిన కోహ్లీ
- తాను గతంలోనే ఉండిపోనంటూ అందులో సందేశం
- సానుకూల అభిప్రాయాలు ఉన్నవాడినన్న కెవిన్ హార్ట్
- లక్నో బౌలర్ నవీనుల్ హక్ పోస్ట్ కు స్పందన
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ నవీనుల్ హక్ తో ఏర్పడిన విభేదానికి ముగింపు పలికే దిశగా విరాట్ కోహ్లీ కీలకమైన పోస్ట్ పెట్టాడు. లక్నో, బెంగళూరు జట్ల మధ్య లక్నోలోని ఏక్నా స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్ లో (మే 1న) కోహ్లీకి, నవీనుల్ హక్ కు మధ్య గొడవ జరగడం తెలిసిందే. మైదానంలో గొడవకు కొనసాగింపుగా సామాజిక మాధ్యమాల్లో ఇరువురూ పోస్టులతో ముంచెత్తారు. మధ్యలో కొన్ని రోజులు ప్రశాంతత ఏర్పడింది. ఢిల్లీ-ఆర్సీబీ మ్యాచ్ లో కోహ్లీ ఒక్క పరుగుకే అవుట్ కావడంపై నవీనుల్ హక్ మరోసారి పోస్ట్ తో స్పందించడం గమనార్హం. మామిడి పండ్లు తియ్యగా ఉన్నాయంటూ, ఇంత తియ్యటి మామిడి పండ్లను తానెప్పుడూ తినలేదంటూ రెండు పోస్టులతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.
దీనికి విరాట్ కోహ్లీ స్పందించాడు. కోహ్లీ మౌనంగా ఉండే స్వభావం కలిగిన వాడు కాదు. దీంతో నవీనుల్ హక్ నోరు మూయించే విధంగా సరైన పోస్ట్ తో అభిమానుల ముందుకు వచ్చాడు. ప్రముఖ అమెరికా హాస్యనటుడు కెవిన్ హార్ట్ కు చెందిన వీడియోని షేర్ చేశాడు. పగల గురించి అందులో కెవిన్ మాట్లాడడాన్ని గమనించొచ్చు. ప్రతికూలతల నుంచి ముందుకు సాగిపోవాలని అందులో అతడు సూచించాడు.
‘‘ఎంత మేర భావోద్వేగాలు, అభిప్రాయాలు ఉన్నాయన్నది ముఖ్యం కాదు. నీకు ఎంత బాధ కలిగిందన్నది కూడా కాదు. జీవితం ముందుకు సాగి పోవాల్సిందే. జీవితం ఎవరి కోసం ఆగిపోదు. నీవు అది అర్థం చేసుకొని ఆ ప్రక్రియలో భాగంగా ముందుకు సాగిపోకుండా, అక్కడే, అదే అంశాన్ని పట్టుకుని వేలాడితే అది జీవితాంతం బాధిస్తుంది. పగలు, ఆగ్రహాలు, ప్రతికూలతలు... వీటి కోసం నాకు సమయం లేదు. ఎందుకంటే నేను ఎన్నో సానుకూల అభిప్రాయాలతో ఉన్నవాడిని. నేను గతంలోనే ఉండిపోను’’ అని కెవిన్ హార్ట్ ఇచ్చిన సందేశాన్ని పరోక్షంగా నవీనుల్ హక్ కు కోహ్లీ తన పోస్ట్ ద్వారా చెప్పినట్టు అయింది. దీంతో అయినా హక్ మౌనంగా ఉండిపోతాడేమో చూడాలి.