ట్రాఫిక్ చలానాతో బయటపడిన భర్త బండారం.. భార్య ఫిర్యాదుతో జైలు పాలు!
- హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ ట్రాఫిక్ కెమెరాలకు చిక్కిన వ్యక్తి
- అతడి స్కూటీ భార్య పేరిట ఉండటంతో ఆమెకు నోటీసులు
- నోటీసులోని ఫొటోల్లో భర్త మరో మహిళతో ప్రయాణించడం గమనించిన భార్య
- భర్త నిలదీత.. దంపతుల మధ్య తగాదా
- చివరకు భర్త తనపై చేయిచేసుకున్నాడంటూ భార్య పోలీసులకు ఫిర్యాదు
- భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు, జ్యుడీషియల్ కస్టడీ విధించిన న్యాయస్థానం
హెల్మెట్ లేకుండా స్కూటీపై ప్రయాణించిన ఓ వ్యక్తి బండారం బట్టబయలు కావడంతో భార్య ఆగ్రహానికి గురయ్యాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చివరకు జైలు పాలయ్యాడు. హెల్మెట్ లేకుండా ప్రయాణించినందుకు కేరళ ట్రాఫిక్ పోలీసులు ఓ వ్యక్తికి జరిమానా విధించారు. సీసీటీవీ కెమెరాకు చిక్కిన అతడి ఫొటోలను కూడా పంపించారు. స్కూటీ భార్య పేర రిజిస్టర్ అయి ఉండటంతో ఈ జరిమానా వివరాలు, భర్త ఫొటో అతడి భార్యకు అందాయి. అయితే, ఆ ఫొటోల్లో భర్త మరో మహిళతో కలిసి ప్రయాణించడం ఆమె కంట పడింది.
ఈ విషయమై ఆమె అతడిని నిలదీసింది. కానీ, తాను ఏ తప్పూ చేయలేదని అతడు భార్యకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. దారిన పోయే మహిళకు తాను లిఫ్ట్ మాత్రమే ఇచ్చానని చెప్పుకొచ్చాడు. కానీ, అతడి వివరణతో భార్య సంతృప్తి చెందకపోవడంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు మే 5న భర్తపై ఆమె కారామానా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనపై దాడి చేశాడని తన ఫిర్యాదులో పేర్కొంది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె భర్తను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.