సీజీఎఫ్ నిధుల వినియోగంపై ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టు స్టే

  • కామన్ గుడ్ ఫండ్ సొమ్మును ధూపదీప నైవేద్యాలకే వినియోగించాలని పిల్
  • నిధుల్ని కార్యాలయాలకు వినియోగించడంపై హైకోర్టు అసంతృప్తి
  • సీజీఎఫ్ నిధుల వినియోగంపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే
కామన్ గుడ్ ఫండ్ సొమ్మును దేవాదాయ శాఖ కార్యాలయాలకు వినియోగించడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం అభ్యంతరం తెలిపింది. సీజీఎఫ్ నిధులతో ప్రభుత్వాన్ని నడపలేరని, ఇప్పుడు నిర్మాణాలకు అనుమతిస్తే రేపటి రోజున ఆఫీసుల్లో స్టేషనరీకి ఈ సొమ్మునే వినియోగిస్తారని వ్యాఖ్యానించింది.

సీజీఎఫ్ నిధులను కార్యాలయాల నిర్మాణాలకు వినియోగిస్తున్నారని ఓ విలేకరి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. నిబంధనల మేరకే నిధులు ఉపయోగించాలని, ఆ సొమ్మును ధూపదీప నైవేద్యానికే వినియోగించాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం దేవాదాయ శాఖ కార్యాలయాల నిర్మాణాలకు సీజీఎఫ్ నిధుల వినియోగంపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది.


More Telugu News