లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర.. నేటి హైలైట్స్, రేపటి షెడ్యూల్ ఇదే!
- నేడు 1200 కి.మీ మైలురాయికి చేరిన లోకేశ్ పాదయాత్ర
- నందికొట్కూరు నియోజకవర్గంలో హోరెత్తిన యువగళం
- మిడుతూరు ఎత్తిపోతల పథకానికి లోకేశ్ శిలాఫలకం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పడుతున్నారు. 95వ రోజున (బుధవారం) యువగళం పాదయాత్ర నందికొట్కూరు నియోజకవర్గంలో హోరెత్తింది. ఇప్పటివరకు యువగళం పాదయత్ర 1206.9 కిలోమీటర్లు పూర్తయింది. ఈ సందర్భంగా హంద్రీనీవా నుంచి మిడుతూరు ఎత్తిపోతల పథకానికి యువనేత లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
బ్రాహ్మణకొట్కూరు, కోళ్ల బావాపురం, వడ్డెమూరు, కోనేటమ్మపల్లి, అల్లూరు మీదుగా యువనేత లోకేశ్ నందికొట్కూరుకు చేరుకున్నారు. పాదయాత్ర దారిలో ఎస్సీలు, ఎస్టీలు, బోయలు, గౌడలు, సర్పంచ్ లు యువనేతను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.
బ్రాహ్మణకొట్కూరులో వైసిపి ప్రభుత్వం పాడుబెట్టిన ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్ ను పరిశీలించిన యువనేత లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం అమలుచేసిన పథకాలను కొనసాగించడం చేతగాని జగన్ స్టిక్కర్లు వేసుకోవడానికి మాత్రం ఏమాత్రం వెనకాడటం లేదని మండిపడ్డారు.
నందికొట్కూరులో జరిగిన బహిరంగసభలో లోకేశ్ మాట్లాడుతూ.. రైతుల్ని అవమానించిన మంత్రి, గోల్ మాల్ జగన్ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి వ్యాఖ్యల్ని సీఎం కనీసం ఖండించలేదన్ని అన్నారు. రైతులు అంటే కనీస గౌరవం లేని వ్యక్తి గోల్ మాల్ జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ 6సమస్యలకు సమాధానం చెప్పండి!
జగన్‌పై నారా లోకేశ్ ఆరు ప్రశ్నలు సంధించారు. ‘‘మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చారు. ఎప్పుడు చేస్తారు? 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు. నాలుగేళ్లు గడిచిపోయాయి. ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు? రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలతో రైతులు నష్టపోయారు. ప్రభుత్వం తడిచిన ధాన్యం కొనాలి. ఎప్పటిలోగా కొంటారు? బీసీల్లో ఉన్న ఉపకులాలకు నిధులు కేటాయిస్తాం అన్నారు. బీసీలకు చెందాల్సిన డబ్బులు ఎప్పటిలోగా బీసీలకు ఇస్తారు? ఎస్సీలకు కేటాయించిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసారు ఎప్పటి లోగా అవి తిరిగి ప్రారంభిస్తారు? పన్నుల భారంతో పెంచేసిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి. ఎప్పటిలోగా తగ్గిస్తారు?’’ అని లోకేశ్ సూటిగా ప్రశ్నించారు.
యువనేతను కలిసిన నందికొట్కూరు దళితులు..
నందికొట్కూరు నియోజకవర్గం బ్రాహ్మణకొట్కూరులో నియోజకవర్గంలో దళితులు యువనేత లోకేశ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎస్సీలకు చెందాల్సిన సబ్ ప్లాన్ నిధులను వైసీపీ ప్రభుత్వం నవరత్నాలకు దారిమళ్లించి తీరని ద్రోహం చేస్తోందని వారు వాపోయారు. వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన 27సంక్షేమ పథకాలను పునరుద్దరించాలని కోరారు. గతంలో అమలుచేసిన అంబేద్కర్ స్టడీసర్కిల్, విదేశీవిద్య, ఎన్ఎస్ఎఫ్ డిసి వంటి పథకాలను మీరు అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టాలని కోరారు.
దీనిపై నారా లోకేశ్ స్పందిస్తూ.. ఎస్సీలకు చెందాల్సిన రూ.28,147 కోట్లు దారిమళ్లించిన దళిత ద్రోహి జగన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. ఎస్సీ సంక్షేమ పథకాలను రద్దుచేయడమేగాక, అదేమని ప్రశ్నించిన దళితులపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ప్రభుత్వం రద్దుచేసిన ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తామని హామీ ఇచ్చారు.
రేపటి యువగళం(11-5-2023) పాదయాత్ర వివరాలు:
నందికొట్కూరు అసెంబ్లీ నియోజక వర్గం (నంద్యాల జిల్లా)
ఉదయం
7.00 – నందికొట్కూరు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం
8.30 – తార్టూరు క్రాస్ వద్ద గ్రామస్తులతో సమావేశం
8.50 – మండ్లెం గ్రామంలో స్థానికులతో సమావేశం
10.15 – తంగడంచ గ్రామంలో స్థానికులతో సమావేశం
10.55 – తంగడంచలో బిసి సామాజిక వర్గీయులతో ముఖాముఖి
11.55 – తంగడంచలో భోజన విరామం
సాయంత్రం
4.00 – తంగడంచ నుంచి పాదయాత్ర కొనసాగింపు
4.20 – జూపాడుబంగ్లాలో తాండవ సామాజికవర్గీయులతో సమావేశం
4.50 – ఎబిఎన్ చర్చిలో క్రిస్టియన్లతో సమావేశం
5.10 – తాటిపాడు క్రాస్ వద్ద రైతులతో సమావేశం
5.50 – తరిగొప్పుల క్రాస్ వద్ద బిసిలతో సమావేశం
6.15 – బన్నూరు వద్ద స్థానికులతో సమావేశం
6.40 –బన్నూరు శివారు విడిది కేంద్రంలో బస