వివేకా హత్య కేసులో మళ్లీ సుప్రీం తలుపు తట్టిన సునీతా రెడ్డి
- గంగిరెడ్డి బెయిల్ రద్దు షరతులను సవాల్ చేస్తూ సునీత పిటిషన్
- బెయిల్‌ను గంగిరెడ్డి దుర్వినియోగం చేసిన ఉదంతాలు ఉన్నాయని ఆరోపణ
- సాక్షులను గంగిరెడ్డి బెదిరించే అవకాశం ఉందని అనుమానం
మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె సునీతా రెడ్డి మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ రద్దు ఉత్తర్వుల్లో షరతులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్‌ను గంగిరెడ్డి దుర్వినియోగం చేసిన ఉదంతాలు ఉన్నాయని పేర్కొన్నారు. సాక్షులను గంగిరెడ్డి బెదిరించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో గంగిరెడ్డి ఏ-1గా ఉన్న విషయం తెలిసిందే.