ఎవరికైనా ఓడిపోవాలని రాసిపెట్టి ఉంటే పక్క పార్టీలకు వెళ్తారు: కోటంరెడ్డిపై అనిల్ కుమార్ పరోక్ష విమర్శలు

ఎవరికైనా ఓడిపోవాలని రాసిపెట్టి ఉంటే పక్క పార్టీలకు వెళ్తారు: కోటంరెడ్డిపై అనిల్ కుమార్ పరోక్ష విమర్శలు
  • స్కూళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల అభివృద్ధి కనిపించడం లేదా? అన్న అనిల్   
  • జగన్ పుణ్యమా అని అన్ని విధాలా లక్షణంగా ఉన్నామని మరిచిపోవద్దని హితవు
  • గతంలో మాదిరిగా రోడ్లపై రోడ్లు వేసి నిధులు దుబారా చేయడం లేదన్న అనిల్ కుమార్
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ బుధవారం పరోక్షంగా నిప్పులు చెరిగారు. ఎవరికైనా ఓడిపోవాలని రాసిపెట్టి ఉంటే పక్క పార్టీలకు వెళ్తారని ఎద్దేవా చేశారు. స్కూళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల అభివృద్ధి వారికి కనిపించదన్నారు. 

జగన్ పుణ్యమా అని అన్ని విధాలా లక్షణంగా ఉన్నామని మరిచిపోతే ఎలా? అని ప్రశ్నించారు. జగన్ ఏమీ చేయలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తనకు కూడా చాలా చేయాలని ఉంటాయని, కానీ ఆయనకు మన ఒక్క నియోజకవర్గమే కాదు కదా... 175 నియోజకవర్గాలు ఉన్నాయన్నారు. గతంలో మాదిరి రోడ్లపై రోడ్లు వేసి నిధులను దుబారా చేయలేదన్నారు.


More Telugu News