మీరు సినిమాను మాత్రమే ఆపగలరు.. సత్యాన్ని ఆపగలరా?: విజయశాంతి

మీరు సినిమాను మాత్రమే ఆపగలరు.. సత్యాన్ని ఆపగలరా?: విజయశాంతి
  • ది కేరళ సినిమాపై దేశ వ్యాప్తంగా వాదోపవాదాలు
  • చూడాలా? వద్దా? అనేది ప్రేక్షకులు నిర్ణయించుకోవాలన్న విజయశాంతి   
  • సినిమాను ప్రజలకు దూరం చేసే హక్కు ఎవరికీ లేదన్న విజయశాంతి
ది కేరళ సినిమాపై దేశ వ్యాప్తంగా వాదోపవాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై కొన్ని రాష్ట్రాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ సినిమా దేశంలో మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉందని కేంద్రంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నాయకురాలు విజయశాంతి మాట్లాడుతూ, ఏ సినిమా అయినా అది చూడాలా? వద్దా?  అనేది ప్రేక్షకులు నిర్ణయించుకోవాలని చెప్పారు. 

ఈ సినిమాను ప్రదర్శించే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం బాధాకరమని అన్నారు. ఒక సినిమాను ప్రజలకు దూరం చేసే హక్కు ఎవరికీ లేదని చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో ఏది అంగీకరించాలో, ఏది తిరస్కరించాలో ప్రజలకు తెలుసని అన్నారు. మీరు సినిమాను మాత్రమే ఆపగలరు... సత్యాన్ని ఆపగలరా? అని ప్రశ్నించారు.


More Telugu News