చిన్న తనంలోనే కళ్లద్దాలు.. కంటి చూపు ఎందుకు మసకబారుతోంది?
- డిజిటల్ స్క్రీన్లపై ఎక్కువ సమయం వెచ్చించడం అనారోగ్యం
- కంటికి తగ్గిపోతున్న విశ్రాంతి
- పర్యావరణ కాలుష్యం, జన్యు సంబంధ అంశాలు
- జీవనశైలిలో మార్పులూ కారణమే
నేడు కళ్లద్దాలు ధరించే స్కూల్ పిల్లలు ఎంతో మంది కనిపిస్తుంటారు. పెద్దల్లోనూ కంటి చూపు సమస్యలు పెరిగిపోయాయి. గతంలో కంటి సమస్యలు 10 శాతం లోపే ఉండేవి. కానీ, నేడు ఇవి రెట్టింపునకు పైగా పెరిగాయి. ఇందుకు ఎన్నో కారణాలున్నాయని చెప్పుకోవాలి. కంటి ఆరోగ్యం పట్ల చాలా మందిలో శ్రద్ధ లోపించిందని చెప్పుకోవాలి. తరచుగా కంటి పరీక్షలు చేయించుకునే వారు కొద్ది మందే ఉంటున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, పోషకాహారం, కంటికి తగినంత విశ్రాంతి ఇవన్నీ కూడా చూపును కాపాడుకోవడంలో కీలకమని గుర్తించాలి.
డిజిటల్ పరికరాలు
నేడు మూడేళ్ల చిన్నారులు సైతం స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై ఎక్కువ సమయం గడుపుతున్నారు. స్కూల్లో డిజిటల్ తెరలు, ఇంట్లో టీవీలు ఇలా గ్యాడ్జెట్లపై వెచ్చించే సమయం ఎక్కువగా ఉంటోంది. కార్యాలయాల్లో కంప్యూటర్లు, రాత్రి నిద్రించే వరకు స్మార్ట్ ఫోన్ వీక్షణ.. దీంతో కంటికి విశ్రాంతి అన్నది కరవవుతోంది. డిజిటల్ ఉపకరణాల నుంచి వచ్చే వెలుగు మన కళ్లపై అదే పనిగా పడడం, విశ్రాంతి లేకపోవడం, కళ్లు తడారిపోవడం ఇవన్నీ చూపును దెబ్బతీస్తున్నాయి.
జీవనశైలి
జీవనశైలిలో మార్పులు కూడా కళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అసలు ఎక్కువ మందికి శారీరక శ్రమ ఉండడం లేదు. దీంతో కళ్లకు మెరుగైన రక్త ప్రసరణ జరగడం లేదు. అలాగే పోషకాల్లేని జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు. దీనికితోడు ఒత్తిడితో కూడిన పనులు ఇవన్నీ కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
పర్యావరణ అంశాలు
పర్యావరణ కాలుష్యం కూడా కంటి చూపు సమస్యలను తెచ్చి పెడుతోంది. యూవీ రేడియేషన్, గాలి కాలుష్యం సైతం కంటి సమస్యలను పెంచుతున్నాయి.
జన్యువులు
కొన్ని రకాల కంటి సమస్యలు జన్యుపరంగా వచ్చేవేనని అర్థం చేసుకోవాలి. మయోపియా (దగ్గరి చూపు సమస్య) అన్నది జన్యుపరమైన కారణాలతోనే ఎక్కువగా వస్తుంది.
వయసు
సాధారణంగా నడి వయసు నుంచి వృద్ధాప్యానికి చేరువ అవుతున్న క్రమంలో కంటి ఆరోగ్యంలో మార్పులు వస్తుంటాయి. శుక్లాల సమస్య ఎక్కువ మందిలో కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో రెటీనా సమస్యలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి.