కేఎల్ రాహుల్ కు సర్జరీ సక్సెస్
- కుడి తొడకు శస్త్ర చికిత్స పూర్తి
- గత వారం ఆర్సీబీతో మ్యాచ్ లో గాయపడ్డ రాహుల్
- ఐపీఎల్ తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ కు దూరం
భారత స్టార్ బ్యాటర్, ఐపీఎల్ జట్టు లక్నోసూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయానికి శస్త్ర చికిత్స విజయవంతమైంది. ఈ విషయాన్ని రాహుల్ బుధవారం స్వయంగా వెల్లడించాడు. అతని కుడి తొడకు అయిన గాయానికి మంగళవారం శస్త్ర చికిత్స జరిగింది. వీలైనంత త్వరగా మైదానంలోకి రావాలని ఎదురుచూస్తున్నానని రాహుల్ పేర్కొన్నాడు. శస్త్ర చికిత్స సజావుగా జరిగినందుకు వైద్యులు, వైద్య సిబ్బందికి రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు.
లక్నోలో గతవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తుండగా కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. దాని వల్ల అతను ఐపీఎల్ తో పాటు జూన్ లో ఆస్ట్రేలియాతో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషన్ ను భారత జట్టులోకి తీసుకున్నారు.