వొడాఫోన్ ఐడియా సేవలకు స్వస్తి.. గుజరాత్‌లో ఇక ప్రభుత్వ ఉద్యోగులకు జియో సేవలు
- పుష్కర కాలంగా వొడాఫోన్ ఐడియా సేవలు
- రూ. 37.50కే పోస్టు పెయిడ్ సేవలు అందించనున్న జియో
- రెండేళ్ల కాలానికి ప్రభుత్వంతో జియో ఒప్పందం
- ఆరు నెలల తర్వాత సేవలపై సమీక్ష
ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై జియో సిమ్ కార్డులనే ఉపయోగించాలంటూ గుజరాత్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 12 సంవత్సరాలుగా అక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు వొడాఫోన్ ఐడియా సేవలు అందిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం వాటిని నిలిపివేసింది. ఉద్యోగులు వినియోగిస్తున్న నంబర్లను జియోకు పోర్ట్ చేయిస్తున్నట్టు తెలిపింది.
గుజరాత్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 37.50కే పోస్టుపెయిడ్ సేవలు అందిస్తామని జియో ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం, రిలయన్స్ సంస్థల మధ్య తొలుత రెండేళ్లకుగాను ఒప్పందం కుదిరింది. ఆరు నెలల తర్వాత జియో సేవలను ప్రభుత్వం సమీక్షిస్తుంది. సంతృప్తికరంగా లేకుంటే ఒప్పందం రద్దవుతుంది. కాగా, జియో తాజా సేవలతో ఉద్యోగులకు నెలకు 30 జీబీ డేటా లభిస్తుంది.