ఓవర్ కు 10 చొప్పున కొడితే ముంబయిదే గెలుపు!
- వాంఖెడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్ × ఆర్సీబీ
- మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 199 పరుగులు
- ముంబయి టార్గెట్ 200 పరుగులు
ముంబయి ఇండియన్స్ తో వాంఖెడే స్టేడియంలో జరుగుతున్న పోరులో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 199 పరుగులు చేసింది. తద్వారా ముంబయి ఇండియన్స్ ముందు 200 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ఓవర్ కు 10 చొప్పున రన్ రేట్ కొనసాగిస్తే ఈ మ్యాచ్ లో ముంబయి విజయం సాధ్యమే.
ఇక, ఆర్సీబీ ఇన్నింగ్స్ ను పరిశీలిస్తే... ఓసారి అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న విరాట్ కోహ్లీ, ఆ తర్వాత బంతికే వికెట్ అప్పగించాడు. కోహ్లీ కేవలం 1 పరుగే చేశాడు. వన్ డౌన్ లో వచ్చిన అనుజ్ రావత్ (6) కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. వీరిద్దరినీ లెఫ్టార్మ్ సీమర్ జాసన్ బెహ్రెండార్ఫ్ అవుట్ చేశాడు.
కానీ, సూపర్ ఫాంలో ఉన్న కెప్టెన్ డుప్లెసిస్, మ్యాక్స్ వెల్ జోడీ భారీ షాట్లతో విజృంభించడంతో ఆర్సీబీ స్కోరుబోర్డు పరుగులు తీసింది. వీరిద్దరూ పోటీలు పడి బౌండరీ వర్షం కురిపించారు. డుప్లెసిస్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేయగా... మ్యాక్స్ వెల్ 33 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు సాధించాడు.
వీరిద్దరూ అవుటైన తర్వాత... ఇన్నింగ్స్ నడిపించే బాధ్యతను దినేశ్ కార్తీక్ స్వీకరించాడు. డీకే 18 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 30 పరుగులు చేశాడు. మధ్యలో ఓసారి లైఫ్ లభించడంతో దాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ వీలైనన్ని పరుగులు జోడించాడు.
ముంబయి ఇండియన్స్ బౌలర్లలో జాసన్ బెహ్రెండార్ఫ్ 3, కామెరాన్ గ్రీన్ 1, క్రిస్ జోర్డాన్ 1, కుమార్ కార్తికేయ 1 వికెట్ తీశారు.