'విరూపాక్ష'లో భైరవ రోల్ ఆయన చేయవలసిందట!
- క్రితం నెలలో విడుదలైన 'విరూపాక్ష'
- 100 కోట్ల క్లబ్ లోకి చేరువలో ఉన్న సినిమా
- భైరవ పాత్రలో మెప్పించిన రవికృష్ణ
- నిజానికి ఈ పాత్ర కార్తీక్ రత్నం చేయవలసిందని వ్యాఖ్య
ఈ మధ్య కాలంలో అందరూ ఎక్కువగా మాట్లాడుకున్న సినిమా 'విరూపాక్ష'. సాయితేజ్ - సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమాకి కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. క్రితం నెల 21వ తేదీన విడుదలైన ఈ సినిమా, 100 కోట్ల క్లబ్ కి చాలా దగ్గరలో ఉంది. రేపో మాపో ఆ మార్క్ ను ఇది టచ్ చేయనుంది.
ఈ సినిమా చూసినవారికి 'భైరవ' పాత్ర తప్పకుండా గుర్తుండిపోతుంది. తన తండ్రి మరణానికి కారకులైన ఊరు ప్రజలపై పగబట్టి, క్షుద్ర విద్యలు నేర్చుకునే పాత్ర ఇది. ప్రేతాత్మగా మారి ప్రజలను పీడించే పాత్ర ఇది. ఈ పాత్రను బుల్లితెర నటుడు రవికృష్ణ పోషించాడు. ఆయనకి మంచి పేరు తీసుకొచ్చింది.
తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "నిజానికి ఈ పాత్రను కార్తీక్ రత్నం చేయవలసింది. ఆయనకి కుదరకపోవడం వలన నాకు అవకాశం వచ్చింది. నన్ను కూడా ఆడిషన్ చేసే తీసుకున్నారు. నాపై నమ్మకంతో ఈ పాత్రను ఇచ్చిన కార్తీక్ వర్మకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను" అని చెప్పుకొచ్చాడు.