నేను జగనన్నకే చెబుతాను... కానీ ఆమె నన్ను వేచి ఉండమంటోంది: వర్ల రామయ్య
- జగనన్నకు చెబుదాం కార్యక్రమం తీసుకువచ్చిన ఏపీ సర్కారు
- 1902 టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు
- నేడు ప్రారంభించిన సీఎం జగన్
- మీడియా సాక్షిగా 1902కి ఫోన్ చేసిన వర్ల రామయ్య
రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వం కొత్తగా జగనన్నకు చెబుదాం కార్యక్రమం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అందుకోసం 1902 టోల్ ఫ్రీ నెంబరును ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ నేడు ప్రారంభించారు.
అయితే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, మీడియా ప్రతినిధుల ఎదురుగా 1902కి ఫోన్ చేశారు. అయితే ఓ లేడీ వాయిస్ స్పందించి... తనను వేచి ఉండమంటోందని వర్ల రామయ్య పేర్కొన్నారు.
"అన్నా... జగనన్నా... ఇవిగో నా సమస్యలు అని నేను జగనన్నకే చెబుతాను... కానీ ఆమె నన్ను వేచి ఉండమంటోంది. జగనన్నకు తాను చెబుతానని ఆమె అంటోంది. లేదమ్మా, సమస్యలు నా దగ్గరే ఉన్నాయి... నేనే చెబుతానని నేనంటున్నాను. ఆమె ఎప్పటికి పిలుస్తోందో! ఆమె ఉత్తర్వుల కోసం వేచి ఉన్నాను. ఇప్పటికి 4 నిమిషాల నుంచి వేచిచూస్తూనే ఉన్నాను. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు జగనన్నకు చెబుతాను నేను... నా సమస్యలు పరిష్కరించమని కోరతాను" అంటూ వర్ల రామయ్య తనదైన శైలిలో మీడియా సమావేశాన్ని రక్తి కట్టించారు.