'సిక్స్' కొట్టేది ఎవరు... ముంబయి ఇండియన్స్ తో ఆర్సీబీ అమీతుమీ
- ముంబయి వాంఖెడే స్టేడియంలో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్
- టోర్నీలో ఇప్పటిదాకా 10 మ్యాచ్ లు ఆడి 5 విజయాలు సాధించిన రెండు జట్లు
- నేటి మ్యాచ్ లో గెలిస్తే పాయింట్ల పట్టికలో పైకి!
ఐపీఎల్ లో నేడు ఆసక్తికర సమరానికి సర్వం సిద్ధమైంది. ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో నేడు ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది.
తాజా సీజన్ లో ఇప్పటివరకు ముంబయి జట్టు 10 మ్యాచ్ లు ఆడి 5 విజయాలు సాధించగా, బెంగళూరు జట్టు కూడా 10 మ్యాచ్ ల్లో 5 విజయాలు నమోదు చేసింది. ఇవాళ్టి మ్యాచ్ లో గెలిచిన జట్టు 6వ విజయంతో పాయింట్ల పట్టికలో ముందంజ వేస్తుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ఆరో స్థానంలో ఉండగా, ముంబయి 8వ స్థానంలో ఉంది.
కాగా, ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ జట్టులో ఒక మార్పు చేసినట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ వెల్లడించాడు. లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ స్థానంలో పేసర్ విజయ్ కుమార్ వైశాఖ్ జట్టులోకి వచ్చాడని తెలిపాడు. అటు, ముంబయి ఇండియన్స్ టీమ్ లోనూ ఒక మార్పు చోటుచేసుకుంది. స్పీడ్ స్టర్ జోఫ్రా ఆర్చర్ స్థానంలో క్రిస్ జోర్డాన్ ను తుదిజట్టులోకి తీసుకున్నారు.